ఆ విష‌యంలో గురువుని ఫాలో అవుతున్న బుచ్చిబాబు

పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా నుంచి ఆల్రెడీ వ‌చ్చిన పోస్ట‌ర్లు ఆడియ‌న్స్ కు సినిమాపై మంచి అంచ‌నాల‌ను నెల‌కొల్పాయి.;

Update: 2025-10-07 08:30 GMT

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా తెర‌కెక్కుతున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టు పెద్ది. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా నుంచి ఆల్రెడీ వ‌చ్చిన పోస్ట‌ర్లు ఆడియ‌న్స్ కు సినిమాపై మంచి అంచ‌నాల‌ను నెల‌కొల్పాయి. ఉప్పెన ఫేమ్, నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ బుచ్చిబాబు సాన పెద్ది సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఏ విష‌యంలోనూ కాంప్ర‌మైజ్ కాకుండా..

విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను బుచ్చిబాబు చాలా భారీ స్థాయిలో తెర‌కెక్కిస్తున్నార‌ని యూనిట్ స‌భ్యులు మొద‌టి నుంచి చెప్పుకుంటూ వ‌స్తున్నారు. పెద్ది విష‌యంలో బుచ్చిబాబు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ అవ‌డం లేద‌ని, త‌న గురువు సుకుమార్ లాగానే పర్ఫెక్ష‌న్ కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నార‌ని తెలుస్తోంది.

అక్టోబ‌ర్ 9నుంచి కొత్త షెడ్యూల్

ఇదిలా ఉంటే పెద్ది సినిమా షూటింగ్ ను బుచ్చిబాబు శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్ప‌టికే పలు షెడ్యూళ్ల షూటింగ్ ను పూర్తి చేసుకున్న పెద్ది, ఇప్పుడు మ‌రో కొత్త షెడ్యూల్ కు ముస్తాబ‌వుతున్నట్టు తెలుస్తోంది. అక్టోబ‌ర్ 9 నుంచి పెద్ది మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుండ‌గా, ఈ షెడ్యూల్ ఒక వారం రోజుల పాటూ ఉంటుంద‌ని స‌మాచారం.

ఈ షెడ్యూల్ లో సినిమాలోని కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించ‌నున్నార‌ట బుచ్చిబాబు. బాలీవుడ్ భామ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలో క‌న్న‌డ స్టార్ శివ రాజ్‌కుమార్, జ‌గ‌ప‌తి బాబు, దివ్యేందు శ‌ర్మ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహ‌మాన్ పెద్దికి సంగీతం అందిస్తుండ‌గా, వ‌చ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Tags:    

Similar News