పెద్ది రిలీజ్ డేట్ ట్విస్ట్.. ఇది మంచి టైమింగే..

వేసవి సెలవులు అంటేనే థియేటర్ల దగ్గర ఒక రకమైన సందడి ఉంటుంది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు ఈ టైమ్‌లో వస్తే ఆ కిక్కే వేరు.;

Update: 2026-05-01 13:26 GMT

వేసవి సెలవులు అంటేనే థియేటర్ల దగ్గర ఒక రకమైన సందడి ఉంటుంది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు ఈ టైమ్‌లో వస్తే ఆ కిక్కే వేరు. అయితే పెద్ద సినిమలేవి కూడా సమ్మర్ ను క్యాష్ చేసుకోలేదు. ముఖ్యంగా రామ్ చరణ్ పెద్ది సినిమా ఎప్పుడో రావాలి. కానీ సినిమా పనులు ఆలస్యం వలన వాయిదా పడుతూ వచ్చింది ఇక ఫైనల్ గా జూన్ నెలాఖరున వస్తుందని అందరూ ఫిక్స్ అయిపోయిన తరుణంలో, సడన్‌గా లెక్కలన్నీ తారుమారయ్యాయి.




 


సాధారణంగా పెద్ద సినిమాల రిలీజ్ డేట్ మారడం అంటే ఏదో షూటింగ్ ఆలస్యమై వెనక్కి జరుగుతుందని అనుకుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతున్న దర్శకుడు బుచ్చిబాబు, అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఒక అడుగు ముందుకు వేశారు. నిన్నటితో శృతి హాసన్ స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా ప్యాకప్ చెప్పేయడంతో, సినిమాను ఇక ఎంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే దానిపై మేకర్స్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.

అసలు విషయం ఏంటంటే, ఎవరూ ఊహించని విధంగా ‘పెద్ది’ రిలీజ్ డేట్‌ను మూడు వారాలు ముందుకు జరిపి జూన్ 4న ఫిక్స్ చేశారు. ఇన్నాళ్లూ జూన్ 25 అని ప్రచారం జరగడంతో చాలామంది హాలిడేస్ అడ్వాంటేజ్ మిస్ అవుతుందేమో అని భయపడ్డారు. కానీ ఇప్పుడు జూన్ మొదటి వారానికే చరణ్ బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటంతో, విద్యార్థులకు సెలవులు ముగిసేలోపు ఆ ఆఖరి పది రోజులను పూర్తిగా క్యాష్ చేసుకోవచ్చనే స్ట్రాటజీని టీమ్ సిద్ధం చేసినట్లు అనిపిస్తుంది.

ఈ డేట్ సెలెక్షన్ వెనుక ఉన్న ప్లాన్ చూస్తుంటే, ఒక పక్కా సోలో విండో కోసం టీమ్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. జూన్ నెలాఖరున ఇతర ప్రాజెక్టుల సందడి ఉండటంతో, ఎవరికీ చిక్కకుండా జూన్ మొదట్లోనే వచ్చి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని చరణ్ భావిస్తున్నట్లు అర్ధమవుతుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలవగా, ఇక రిలీజ్ వరకు మరికొన్ని సాంగ్స్ తో మరింత బజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. పల్లెటూరి నేటివిటీతో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ ఒక రగ్డ్ లుక్ లో కనిపించబోతున్నారు. జాన్వీ కపూర్ గ్లామర్, శివ రాజ్‌కుమార్ పవర్ ఫుల్ రోల్ సినిమాకు మెయిన్ పిల్లర్స్ కానున్నాయి. ఫైనల్ గా పెద్ది రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ కి ఎండ్ కార్డ్ పడటంతో మెగా ఫ్యాన్స్ లో జోష్ మొదలైంది. జూన్ 4న థియేటర్లలో రామ్ చరణ్ చేసే రచ్చ ఎంత వరకు క్లిక్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News