పెద్ది సాంగ్ బ్లాస్ట్.. ఆడిటోరియం దద్దరిల్లిపోతుందా..?

ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ రెహమాన్ కంపోజింగ్ లో పెద్ది వస్తుంది. ఐతే ఈ సాంగ్స్ ని సినిమాకు పెద్ద అసెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట.;

Update: 2025-10-31 08:17 GMT

ఉప్పెన తర్వాత బుచ్చి బాబు తన రెండో సినిమానే ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ షాట్ తోనే క్రేజీ వైబ్ వచ్చేలా చేశారు. ఈసారి చరణ్ షాట్ సూపర్ హిట్ కాదు పక్కా బ్లాక్ బస్టర్ అనిపించేలా పెద్ది టీజర్ ఉంది. ఇక ఈ టీజర్ లో రెహమాన్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆస్కార్ విన్నర్ రెహమాన్ తెలుగు సినిమాలకు చాలా అరుదుగా మ్యూజిక్ అందిస్తుంటారు.

రెహమాన్ కంపోజింగ్ పెద్ద అసెట్..

ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ రెహమాన్ కంపోజింగ్ లో పెద్ది వస్తుంది. ఐతే ఈ సాంగ్స్ ని సినిమాకు పెద్ద అసెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. పెద్ది ఫస్ట్ సింగిల్ ని త్వరలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సాంగ్ కి విజువల్ గా బెస్ట్ ఇచ్చేందుకు బుచ్చి బాబు అండ్ టీం కృషి చేస్తున్నారట. ఐతే పెద్ది నుంచి రిలీజ్ కాబోతున్న ఈ సాంగ్ ని రెహమాన్ తన లైవ్ కన్సర్ట్ లో కూడా రిలీజ్ చేస్తారట.

త్వరలో రెహమాన్ లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ జరగబోతుంది. అందులో పెద్ది సాంగ్ కూడా ఆడిటోరియం దద్దరిల్లిపోయేలా చేస్తుందని అంటున్నారు. రెహమాన్ కన్సర్ట్ కి ముందే పెద్ది సాంగ్ రిలీజ్ చేస్తారని తెలుస్తుండగా రెహమాన్ కన్సర్ట్ లో ఈ సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ కాబోతుందని అంటున్నారు. పెద్ది సినిమా ప్రతి అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ కి సూపర్ స్టఫ్ ఇస్తున్నాడు బుచ్చి బాబు. తప్పకుండా సినిమా పెట్టుకున్న టార్గెట్ ని రీచ్ అయ్యేలానే ఉంటుందనిపిస్తుంది.

పెద్ది సాంగ్ బ్లాస్ట్ త్వరలో..

పెద్ది సినిమా సాంగ్ బ్లాస్ట్ త్వరలో ఉండబోతుంది. ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. మ్యూజిక్ విషయంలో అంటే సాంగ్స్ మాత్రమే కాదు బిజిఎం కూడా క్రేజీగా ఉండబోతుందని తెలుస్తుంది. ఎందుకో పెద్ది విషయంలో రెహమాన్ కూడా స్పెషల్ ఫోకస్ చేస్తున్నారని తెలుస్తుంది. ఉప్పెనతో డైరెక్టర్ గా సూపర్ హిట్ అందుకున్న బుచ్చి బాబు పెద్దితో ఎలాంటి హంగామా చేస్తాడన్నది చూడాలి. పెద్ది వర్క్ అవుట్ అయితే మాత్రం రీ సౌండ్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది.

RRR తర్వాత ఆచార్య, గేం ఛేంజర్ రెండు సినిమాలు మెగా ఫ్యాన్స్ ని చాలా డిజప్పాయింట్ చేశాయి. అందుకే చరణ్ పెద్దితో భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. పెద్ది తర్వాత చరణ్ సుకుమార్ డైరెక్షన్ లోనే అది కూడా మైత్రి మూవీ బ్యానర్ లోనే చేస్తారని తెలుస్తుంది.

Tags:    

Similar News