పెద్దిలో ఓ ఒక్కటి లేపేశారా.. ఎందుకు?

రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న 'పెద్ది' సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Update: 2026-06-03 10:32 GMT

రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న 'పెద్ది' సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఒక పాటను ఫైనల్ కట్ లో డిలీట్ చేశారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇందులో అసలు ట్విస్ట్ ఏమిటంటే ఆ పాటను మేకర్స్ కనీసం షూట్ కూడా చేయలేదట. సినిమా కథకు, అందులో నడిచే ఎమోషన్స్ కు ఆ పాట అడ్డు పడుతుందని డైరెక్టర్ బుచ్చిబాబు ముందే ఒక నిర్ణయానికి వచ్చేశారని తెలుస్తోంది.

అందుకే ఆ పాటను పూర్తిగా పక్కన పెట్టేసినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో కంటెంట్ ఎంత సీరియస్ గా ఉండబోతోందో అర్థమవుతోంది. ఒక పెద్ద స్టార్ హీరో సినిమా అనగానే ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా సాంగ్స్, ఫైట్స్ ఇరికిస్తుంటారు. థియేటర్లలో ఎంజాయ్ చేయడానికి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలని ఫీలవుతారు. కానీ ఈసారి ఆ రొటీన్ ఫార్మాట్ ను డైరెక్టర్ బ్రేక్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

కథలోని ఒక ముఖ్యమైన సందర్భంలో ఈ పాట రావాల్సి ఉన్నా, దానివల్ల ఫ్లో దెబ్బతింటుందని టీమ్ భావించింది. కేవలం ఒక పాట కోసం బలవంతంగా కథను మార్చడం కరెక్ట్ కాదనే ఉద్దేశ్యంతో ఇంత గట్టి నిర్ణయం తీసుకున్నారని సమాచారం. చరణ్ లాంటి స్టార్ సినిమాలో కథకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం మెచ్చుకోదగ్గ విషయం.

మేకర్స్ తీసుకున్న ఈ స్టెప్ చూస్తుంటే వాళ్లకు వాళ్ళు రాసుకున్న స్క్రిప్ట్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో ఇట్టే తెలుస్తోంది. నేటి తరం ఆడియన్స్ అనవసరమైన పాటల కంటే గ్రిప్పింగ్ గా సాగే కథనానికే కనెక్ట్ అవుతున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో సినిమా ఫీల్ చెడగొట్టడం కంటే, పక్కా ఎమోషన్ ను లాస్ట్ వరకు క్యారీ చేయడమే బెటర్ అని చిత్ర బృందం నమ్మిందట. ఇలా సాంగ్స్ కోసం కాంప్రమైజ్ కాకుండా కథను కథలాగే చెప్పాలనే ఆలోచన సినిమా ఫైనల్ రిజల్ట్ కు చాలా హెల్ప్ అవుతుంది.

ఏఆర్ రెహమాన్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ కు పని చేస్తుండటంతో పాటలపై మంచి క్రేజ్ ఉంది. ఆ డిలీట్ చేసిన పాట ట్యూన్ కూడా అద్భుతంగా వచ్చిందట. అయినా సరే సినిమా సోల్ ను చెడగొట్టకూడదనే ఒకే ఒక్క కారణంతో దాన్ని పక్కనపెట్టారని టాక్. ఈ డెసిషన్ తో పెద్ది లో ఎలాంటి కంటెంట్ ఉండబోతోందనే దానిపై అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ రస్టిక్ లుక్, జాన్వీ కపూర్ రోల్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. రేపు థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త ఫీలింగ్ ఇస్తుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. కేవలం కథను మాత్రమే నమ్ముకుని పెద్ది టీమ్ వేసిన ఈ అడుగు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో త్వరలోనే తేలిపోతుంది.

Tags:    

Similar News