వీడియో : చరణ్ ఫ్యాన్స్ పిచ్చెక్కి పోతారు
రామ్ చరణ్ లుక్ ఇప్పటికే రివీల్ అయింది. అయినప్పటికీ తాజాగా రామ్ చరణ్ అయ్యప్ప మాలలో ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.;
రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' సినిమాను చరణ్ చేస్తున్నాడు. గత కొన్ని నెలలుగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. బుచ్చిబాబు మొదటి సినిమా 'ఉప్పెన'తో బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు. మొదటి సినిమాతో మరే దర్శకుడికి దక్కని రికార్డ్‌లు చాలానే బుచ్చిబాబుకు దక్కాయి. అందుకే ఎన్టీఆర్, చరణ్ వంటి స్టార్స్ సైతం ఆయన దర్శకత్వంలో సినిమాలను చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఎన్టీఆర్‌తో సినిమా మొదలు అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల సినిమా క్యాన్సల్ అయింది. వెంటనే రామ్ చరణ్‌తో బుచ్చిబాబు మొదలు పెట్టాడు. రెండో సినిమానే అయినప్పటికీ భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈసినిమా ఉండబోతుంది.
రామ్ చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్
బుచ్చిబాబు ఈ సినిమాను విభిన్నమైన స్పోర్ట్స్ డ్రామాగా ప్లాన్ చేశారు. ఆకట్టుకునే కథ, కథనంతో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకు రావడం ఖాయం అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ నటించిన కారణంగా అంచనాలు భారీగా పెరిగాయి. ఈమె హీరోయిన్‌గా నటించిన దేవర సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆకట్టుకునే అందంతో పాటు రామ్ చరణ్ కు జాన్వీ కపూర్ సరి జోడీ అని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. జాన్వీ కపూర్ ఎప్పుడు రామ్ చరణ్ కి జోడీగా నటిస్తుందా అని ఎదురు చూస్తున్న శ్రీదేవి ఫ్యాన్స్‌కి ఇది పెద్ద గుడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్ వరకు సినిమా షూటింగ్ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.
పెద్దిలో రామ్ చరణ్ లుక్‌కి ఫిదా
రామ్ చరణ్ లుక్ ఇప్పటికే రివీల్ అయింది. అయినప్పటికీ తాజాగా రామ్ చరణ్ అయ్యప్ప మాలలో ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ పెద్ద హెయిర్ స్టైల్‌తో పాటు, గడ్డంను చూసి చాలా మంది సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఆకట్టుకునే లుక్‌తో చరణ్ పిచ్చెక్కిస్తున్నాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ యొక్క ఈ కొత్త లుక్ ను ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ చరణ్ మాస్ లుక్ కి ఇప్పటికే పెద్ది సినిమా పై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా ఈ వీడియోలో రామ్ చరణ్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆహా ఓహో అంటూ తెగ కామెంట్స్ చేస్తూ సినిమా కోసం ఎదురు చూస్తున్నామని అంటున్నారు.
చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ
గేమ్ ఛేంజర్ సినిమాతో అభిమానులను నిరాశ పరచిన రామ్ చరణ్ ఈ సినిమాతో ఖచ్చితంగా ఆకట్టుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని చరణ్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని ఈ ఫోటోలు, వీడియోలు చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంది. తప్పకుండా అన్ని వర్గాల వారిని ఈ సినిమా ఆకట్టుకుంటుంది. వచ్చే ఏడాది మార్చి నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తప్పకుండా మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు అనడంలో సందేహం లేదు అని మేకర్స్ అంటున్నారు. చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా ఈ సినిమా నిలువబోతుంది. రంగస్థలం ను మించి ఈ సినిమా ఉండబోతుంది.