రామ్ చ‌ర‌ణ్ గ్యాప్ ఇవ్వ‌నంటున్నాడా!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పాన్ ఇండియా వ‌ర‌ల్డ్ లోకి అడుగు పెట్టిన త‌ర్వాత లైన‌ప్ మిస్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-07-18 02:45 GMT

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పాన్ ఇండియా వ‌ర‌ల్డ్ లోకి అడుగు పెట్టిన త‌ర్వాత లైన‌ప్ మిస్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. అంత‌వ‌ర‌కూ ఏడాది ఒక్క సినిమా క‌చ్చితంగా రిలీజ్ ఉండేలా చూసుకునేవారు. 2019 వ‌ర‌కూ ఇదే విధానంలో లైన‌ప్ క‌నిపిస్తుంది. కానీ `ఆర్ ఆర్ ఆర్` నుంచి లైన‌ప్ అంతా మారిపోయింది. `ఆర్ ఆర్ ఆర్` త‌ర్వాత మ‌రో సినిమా రిలీజ్ కు ఏకంగా మూడేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. మ‌ధ్య‌లో `ఆచార్య‌`లో కీల‌క పాత్ర పోషించారు. అలాగే బాలీవుడ్ లో `కిసీకా భాయ్ కిసీకా జాన్` లో స‌ల్మాన్ ఖాన్ కోసం గెస్ట్ రోల్ పోషిం చారు.

ఆ త‌ర్వాత సోలో సినిమా రిలీజ్ కు మూడేళ్లు స‌మ‌యం ప‌ట్టింది. అదే `గేమ్ ఛేంజ‌ర్`. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా అది. ప్ర‌స్తుతం `పెద్ది`లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా వ‌చ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. ఆ త‌ర్వాత సుకుమార్ ప్రాజెక్ట్ మొద‌ల‌వుతుంది. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఏడాది నుంచి మ‌ళ్లీ పాత లైన‌ప్లోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నాడా? అది పూర్తి స్థాయిలో అమ‌లు కాక‌పోయినా ఏడాదిన్న‌ర‌కు ఒక సినిమా అయినా రిలీజ్ అయ్యేలా ప్ర‌ణాళిక సిద్దం చేస్తున్నాడా? అంటే అవున‌నే తెలుస్తోంది.

`పెద్ది` షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకోగానే డిసెంబ‌ర్ లోనే సుకుమార్ సినిమా ప‌ట్టాలెక్కించాల‌ని ప్లాన్ చేస్తు న్నాడుట‌. ఈనేప‌థ్యంలో చ‌ర‌ణ్ త‌దుప‌రి సినిమాల‌కు సంబంధించి చ‌ర్య‌లు ఇప్ప‌టి నుంచే మొద‌లు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. సుకుమార్ అనంత‌రం ప్ర‌శాంత్ నీల్, త్రివిక్ర‌మ్ తో సినిమాలు చేసేలా త‌న టీమ్ ప్రణాళిక సిద్దం చేస్తోందిట‌. `పెద్ది` వ‌చ్చే ఏడాది మార్చిలో రిలీజ్ అవుతుంది. అప్ప‌టికే ఆర్సీ 17 ప‌ట్టాలెక్కుతుంది.ఆ ఏడాదంతా ఆ సినిమా షూటింగ్ లోనే బిజీగా ఉంటాడు. ఆ చిత్రాన్ని 2027 లో రిలీజ్ చేసేలా ప్ర‌ణాళిక రెడీ అవుతుంది.

ఈ సినిమా షూట్ క్లైమాక్స్ కు రాగానే వ‌చ్చే ఏడాది చివ‌ర్లోనే ప్ర‌శాంత్ నీల్ తో సినిమా చేయా ల‌ని ప్లాన్ చేస్తున్నాడుట‌. ఇది 2028లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారుట‌. అలాగే త్రివిక్ర‌మ, సందీప్ రెడ్డి వంగాతో కూడా చ‌ర‌ణ్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడుట‌. వాళ్ల‌తోనూ ఇదే ఆర్డ‌ర్ లో సినిమాలు చేసేలా ఓ ప్లానింగ్ రెడీ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌భాస్ ఇదే స్ట్రాట‌జీతో సినిమాలు చేయ‌డంతోనే రిలీజ్ లు సాధ్య‌మ‌వుతుంది. చ‌ర‌ణ్ కూడా అదే ప్లానింగ్ అమ‌లు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది.

Tags:    

Similar News