• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  RRR చరణ్ ఇంట్రో సీన్.....

RRR చరణ్ ఇంట్రో సీన్.. అంత కష్టపడ్డారా?

| అయితే ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ గుర్తుందా? సినిమాలోని హైలెట్ సీన్స్ లో అదొకటి. స్వాతంత్ర్యం కోసం పోరాడే చాలా మంది.. పోలీస్ స్టేషన్ పైకి దండయాత్రలా వస్తుంటారు.

By - Tupaki Desk
Update: 2024-12-27 10:22 GMT

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఆ చిత్రంతో వేరే లెవెల్ క్రేజ్ సంపాదించుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఇక జక్కన్న అయితే సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయారు.

అయితే ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ గుర్తుందా? సినిమాలోని హైలెట్ సీన్స్ లో అదొకటి. స్వాతంత్ర్యం కోసం పోరాడే చాలా మంది.. పోలీస్ స్టేషన్ పైకి దండయాత్రలా వస్తుంటారు. ఆ సమయంలో వారిని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు. అక్కడే ఉన్న రామ్ చరణ్.. ఎంతో ధైర్యంగా ఆ సన్నివేశాన్ని ఎదుర్కొంటాడు.

రామ్ చరణ్ ను చూసి అంతా వెనక్కి వెళ్తారు. అదంతా చరణ్ ఓ కన్ను లోపల నుంచి మనం చూశాం. చెప్పాలంటే ఆ సమయంలో అందరికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఏదేమైనా చరణ్ ఎంట్రీ సీన్.. ఎప్పటికీ ఎవర్ గ్రీన్. చరణ్ ఫ్యాన్సే కాకుండా.. మిగతా హీరోల అభిమానులు.. ఆ సన్నివేశాన్ని కచ్చితంగా మెచ్చుకుని తీరుతారు!.

అయితే ఇప్పుడు ఆ సీన్ కోసం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చరణ్ ఇంట్రో సీన్ గురించి జక్కన్న మాట్లాడారు. కళ్లలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రజలను చూపించిన సీన్.. రియల్ గా షూట్ చేశామని తెలిపారు.

చరణ్ కన్ను దగ్గరకు పూర్తిగా కెమెరా పెట్టి తీశామని చెప్పారు. ఆ తర్వాత ఆ సీన్ గురించి పలు విషయాలను పంచుకున్నారు. షూటింగ్ విజువల్స్ ను కూడా చూపించారు. దీంతో అంతా షాకైపోతున్నారు. చరణ్ ఇంట్రో సీన్ కోసం వేరే లెవెల్ లో రాజమౌళి అండ్ టీమ్ కష్టపడినట్లు క్లియర్ గా తెలుస్తోందని కామెంట్లు పెడుతున్నారు.

ఏ ఇతర టీమ్ అయినా రెండు రోజుల తర్వాత ఆ సీన్ షూట్‌ ను నిలిపివేసి ఉండవచ్చని అంటున్నారు. కానీ అలాంటి ఫీట్‌ ను తీయడానికి నిజమైన దమ్ము కావాలని అభిప్రాయపడుతున్నారు. ఆ విషయంలో జక్కన్న తోప్ అని.. డాక్యుమెంటరీ వచ్చాక ఆ సీన్ వెనుక కష్టమంతా తెలుస్తోందని అంటున్నారు. అయితే అంత కష్టపడ్డారు కాబట్టే.. అంతకు మించి ప్రతిఫలం అందుకున్నారని చెప్పడంతో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

Tags:    
  • Ramcharan 
  • RRR 
  • Introscene 
  • Ssrajamouli 
  • Panindianfilm 
  • RRRDocumentry 
  • Netflix 
  • JrNTR 
  • DVVDanayya 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS