చరణ్ 'పెద్ది'.. ఇంకెన్ని 'క్రికెట్ స్టెప్పులు' ఉన్నాయబ్బా?
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్దిపై అభిమానుల్లో రోజు రోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.;
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్దిపై అభిమానుల్లో రోజు రోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చాయి. అయితే తాజాగా సినిమాలోని డ్యాన్స్ స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి. ముఖ్యంగా క్రికెట్ స్టైల్ మూమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ తోపాటు ఫస్ట్ సాంగ్ చికిరి చికిరి..లో చరణ్ చేసిన స్పెషల్ స్టెప్ అభిమానులను ఫుల్ గా ఆకట్టుకుంది. బ్యాట్ ను నేలపై ట్యాప్ చేసి, వెంటనే బాల్ ను కొట్టినట్లుగా చూపించిన ఆ స్టెప్ క్రికెట్ షాట్ లా కనిపించి వైరల్ అయింది. క్రికెట్ అభిమానులు కూడా ఆ స్టెప్ ను రీల్స్, షార్ట్ వీడియోల రూపంలో రీ క్రియేట్ చేస్తూ ట్రెండ్ చేశారు.
ఇప్పుడు తాజాగా విడుదలైన రెండో సాంగ్ రై రై రారా.. లో మరో కొత్త స్టెప్ చూపించారు. ఈసారి చరణ్ బ్యాట్ ను గాల్లోకి విసిరి తిప్పి, వెంటనే చేతులను నేలపై రుద్దుకుని గ్రిప్ కోసం డస్ట్ తీసుకుని మళ్లీ బ్యాట్ పట్టుకుంటారు. ఇది కూడా క్రికెట్ ప్లేయర్ బ్యాటింగ్ కు రెడీ అవుతున్న ఫీల్ ను ఇస్తోంది. ఆ యాక్షన్ కు థియేటర్లలో అభిమానులు ఈలలు వేయడం పక్కాలా ఉంది.
అయితే చరణ్ డ్యాన్స్ లో ఎప్పుడూ ఫ్రెష్ నెస్ ఉంటుందనే పేరుంది. కానీ పెద్దిలో మాత్రం డ్యాన్స్, యాక్షన్, స్పోర్ట్స్ మేనరిజం అన్నీ కలిపి ఒక స్పెషల్ స్టైల్ క్రియేట్ చేస్తున్నాయి. ఒక్కో పాటలో ఒక్కో కొత్త క్రికెట్ స్టెప్ చూపిస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్నారు మేకర్స్. దీంతో అభిమానుల్లో ఒకే ప్రశ్న వినిపిస్తోంది. ఇంకా ఎన్ని కొత్త స్టెప్పులు మిగిలి ఉన్నాయోనని డిస్కస్ చేసుకుంటున్నారు.
కాగా.. సినిమాలోని మిగతా పాటల్లో కూడా ఇలాంటి స్పోర్ట్స్ థీమ్ మూమెంట్స్ ఉండనున్నాయని సమాచారం. క్రికెట్ షాట్స్, బ్యాట్ ట్రిక్స్, గ్రౌండ్ మేనరిజంలను డ్యాన్స్ లో కలిపి ప్రత్యేక కొరియోగ్రఫీ రూపొందించారని టాక్ వినిపిస్తోంది. అవి యూత్ కు బాగా కనెక్ట్ అవుతాయని ఫిక్స్ అయ్యారట. ముఖ్యంగా చరణ్ బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ స్టెప్పులకు మరింత ఎనర్జీ ఇస్తోంది.
సాధారణ డ్యాన్స్ కాకుండా క్యారెక్టర్ కు తగ్గట్టు, కథకు సరిపోయేలా మూవ్స్ డిజైన్ చేయడం విశేషం. అందుకే ప్రతి స్టెప్ ఓ సిగ్నేచర్ మేనరిజంలా మారుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో క్రికెట్ స్టెప్ ఛాలెంజ్ మొదలైంది. ఫ్యాన్స్, యూత్ ఆ స్టెప్పులు ఫాలో అవుతూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యేలోపు మరింత ట్రెండ్ అయ్యే అవకాశముంది. మొత్తానికి పెద్దిలో రామ్ చరణ్ డ్యాన్స్ కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందనే చెప్పాలి. మరి ఇంకెన్ని క్రికెట్ స్టెప్పులు థియేటర్లలో సందడి చేయబోతున్నాయో వేచి చూడాలి.