ఏడాదికి ఒక్క సినిమా కూడా లేదా? చరణ్ ఫిల్మోగ్రఫీపై ఫ్యాన్స్ రియాక్షన్!
ఒకప్పుడు మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఏడాదికి పది నుంచి పదిహేను సినిమాలు రిలీజ్ చేస్తూ అభిమానులను అలరించేవాళ్ళు. సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి లాంటి దిగ్గజాలు దీనిని చేసి చూపించారు.
ఒకప్పుడు మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఏడాదికి పది నుంచి పదిహేను సినిమాలు రిలీజ్ చేస్తూ అభిమానులను అలరించేవాళ్ళు. సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి లాంటి దిగ్గజాలు దీనిని చేసి చూపించారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రెండేళ్లకు లేదా మూడేళ్లకు ఒక్క సినిమా వస్తేనే ఎక్కువైపోయింది. తాజాగా రామ్ చరణ్ ఫిల్మోగ్రఫీ, ఆయన చేస్తున్న సినిమాల స్పీడ్‌పై సోషల్ మీడియాలో మెగా అభిమానులు , సినీ ప్రేమికుల మధ్య ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
19 ఏళ్ల కెరీర్.. కేవలం 16 సినిమాలు మాత్రమే:
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చిత్ర పరిశ్రమలోకి వచ్చి దాదాపు 19 సంవత్సరాలు పూర్తయింది. అయితే ఇప్పటివరకు ఆయన నటించిన చిత్రాలు కేవలం 16 మాత్రమే కావడం గమనార్హం. ఇందులో 'ఆచార్య'లో చేసిన అతిథి పాత్ర కూడా ఉంది. అంటే ఏడాదికి ఒకటి కూడా లేదు. భారీ అంచనాలతో వచ్చిన 'గేమ్ ఛేంజర్' బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో, అంత సమయం కేటాయించినా ప్రయోజనం లేకుండా పోయిందని ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక మొన్న వచ్చిన పెద్ది మూవీ ఎంతో కస్టపడితే కాస్త ఆ మాత్రం రిజల్ట్ వచ్చింది.
సోషల్ మీడియా ట్రోలింగ్స్:
చరణ్ సినిమా షూటింగ్ నెమ్మదిగా సాగుతుండటంతో, సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలై కిరణ్ అబ్బవరం తో పోలికలు చేస్తూ పోస్టులు పెరుగుతున్నాయి.. ఆరేళ్ల క్రితం పరిశ్రమలోకి వచ్చిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం అప్పుడే 15 సినిమాలు పూర్తి చేయగా, చరణ్ 19 ఏళ్లలో 16 సినిమాలు మాత్రమే చేశారంటూ ట్రోలర్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ పోలిక సమంజసం కాకపోయినా, చరణ్ వేగం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది అందరి అభిప్రాయం.
కథల ఎంపికపై చరణ్ పునరాలోచించుకోవాలా?:
డైరెక్టర్ల బ్రాండ్ ఇమేజ్‌ను మాత్రమే నమ్ముకోకుండా, తన సొంత ఇమేజ్ మరియు మార్కెట్‌కు సరిపోయే కథలను ఎంచుకోవడంపై చరణ్ దృష్టి పెట్టాలని విశ్లేషకులు భావిస్తున్నారు. దర్శకులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు అవసరమైనప్పుడు మార్పులు చేర్పులు సూచించడం ముఖ్యం. 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాలో చిరంజీవి గారు వెంకటేష్ పాత్రను సూచించినట్లే, కథలో అవసరమైన సలహాలు ఇవ్వడం వల్ల సినిమా అవుట్‌పుట్ మెరుగ్గా వస్తుంది.
ప్రభాస్ ఒక్కడే కాస్త బెటర్:
నిజానికి ఈ నెమ్మదితనం ఒక్క రామ్ చరణ్ సమస్య మాత్రమే కాదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా ప్రాజెక్టుల వల్ల చాలా సమయం తీసుకుంటున్నారు. ఉన్నంతలో రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలు షూటింగ్స్ పూర్తి చేస్తూ కాస్త బెటర్‌గా కనిపిస్తున్నారు.
స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేయడం మంచిదే అయినా, మరీ ఇన్నేళ్ల సమయం కేటాయించడం వల్ల అభిమానుల నిరీక్షణ భారమవుతోంది. రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్టు సుకుమార్ తో చేయబోయే 'ఆర్సి 17' చిత్రాలను వేగంగా పూర్తి చేసి, వరుస సినిమాలతో అలరించాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.