'ఆంధ్ర కింగ్ తాలుకా'.. పవన్ ఇంపాక్ట్ అలా ఉంది మరి!
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ లేటెస్ట్ మూవీ నేమ్ ఆంధ్ర కింగ్ తాలూకా.. ఆ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఒకే ఒకటి.;
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ లేటెస్ట్ మూవీ నేమ్ ఆంధ్ర కింగ్ తాలూకా.. ఆ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఒకే ఒకటి. అదే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా ట్యాగ్.. గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ ట్యాగ్ ఫుల్ పాపులర్ అయింది. సోషల్ మీడియాలో అయితే ఓ రేంజ్ లో హ్యాష్ ట్యాగ్స్ కనిపించాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఆయన ఫ్యాన్స్, పిఠాపురం ప్రజలు.. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. అనేక మంది తమ వెహికల్స్ పై కూడా పిఠాపురం తాలూకా అని ప్రింట్ ను వేసుకున్నారు.
దీంతో పిఠాపురం తాలూకా.. బాగా వైరల్ అయింది. ఇప్పుడు రామ్ మూవీకి ఆంధ్ర కింగ్ తాలుకా అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. నేడు రామ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో పిఠాపురం తాలూకాను ఇన్స్పిరేషన్ గా తీసుకుని రామ్ మూవీకి టైటిల్ పెట్టినట్లు ఉందని నెటిజన్లు అంటున్నారు.
కానీ టైటిల్ కు మాత్రం రీచ్ సూపర్ గా వస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. అదే సమయంలో టాలీవుడ్ పై పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ గట్టిగా పడినట్లుగా కనిపిస్తోంది. ఏకంగా టైటిల్ నే ఇన్స్పిరేషన్ గా పెట్టారని.. ఇది మామూలు ఇంపాక్ట్ కాదని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. మొత్తానికి రామ్ మూవీ టైటిల్ ఇప్పుడు హాట్ టాపికైంది.
అయితే కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్.. ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకాతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఆ సినిమాకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ పి.మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు..
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమా స్టోరీలో ఆయన హీరో కాగా.. ఫ్యాన్ గా రామ్ కనిపించనున్నారు. ఇప్పటికే గ్లింప్స్ ద్వారా అది క్లారిటీ వచ్చేసింది. హై ఎనర్జీతో న్యూ ఏజ్ స్టోరీగా తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరి పవన్ ఇంపాక్ట్ తో టైటిల్ పెట్టుకున్నట్టు అనిపిస్తున్న మూవీతో ఏపీ డిప్యూటీ సాబ్ రాజకీయాల్లో హిట్ అయినట్లు.. రామ్ కూడా హిట్ అందుకుంటారేమో చూడాలి.