రకుల్ స్విమ్ సూట్ హొయలు.. ఇది నెవ్వర్ బిఫోర్ లుక్
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్, గ్లామర్ విషయంలో ఎప్పుడూ తగ్గేదే లేదని నిరూపిస్తోంది.;
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్, గ్లామర్ విషయంలో ఎప్పుడూ తగ్గేదే లేదని నిరూపిస్తోంది. ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ బ్యూటీ, తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెంచేసింది. ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఆమె ఇచ్చిన పోజులు కుర్రాళ్ళ మనసులను దోచేస్తున్నాయి.
ఈ ఫొటోషూట్‌లో రకుల్ నీలి రంగు స్విమ్ సూట్ తరహా డ్రెస్ లో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ డ్రెస్‌లో ఆమె గ్లామర్ ను హైలెట్ చేస్తూనే తన చూపులతో కూడా ఎట్రాక్ట్ చేసింది. ఆమె గ్లామర్ హొయలు చూసేవారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. స్విమ్మింగ్ పూల్ పక్కన నిలబడి, తీక్షణమైన చూపులతో ఆమె విసిరే గ్లామర్ బాణాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఈ లుక్‌ను మరింత ఎలివేట్ చేయడానికి రకుల్ బంగారు ఆభరణాలను ఎంచుకుంది. మెడలో లేయర్స్‌గా ఉన్న గోల్డ్ చైన్స్, చేతికి బ్రాస్లెట్స్, వేళ్లకు రింగులు ధరించి రాయల్ లుక్‌ను సొంతం చేసుకుంది. మోడ్రన్ అవుట్‌ఫిట్‌కి ట్రెడిషనల్ టచ్ ఇస్తూ ఆమె చేసిన ఈ ప్రయోగం ఫ్యాషన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కెరీర్ పరంగా చూస్తే రకుల్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉంది.
ముఖ్యంగా బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. త్వరలో రాబోతున్న ఒక సినిమాలో ఆమె పాత్రపై భారీ అంచనాలు ఉన్నాయి. పెళ్లి తర్వాత కూడా గ్లామర్ షోలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, మరింత రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. లీడింగ్ లేడీ అనే ట్యాగ్‌తో మ్యాగజైన్ ఆమెను కవర్ పేజీపై ప్రచురించడం ఆమె క్రేజ్‌కు అద్దం పడుతోంది. ఫిట్నెస్, అందం, అభినయం కలగలిసిన రకుల్, రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.