దే దే ప్యార్ దే 2 నుంచీ "రాత్ భర్" సాంగ్ రిలీజ్!

అజయ్ దేవగన్ నటించిన దేదే ప్యార్ దే సినిమాకి సీక్వెల్ గా వస్తున్న సినిమానే దే దే ప్యార్ దే 2..;

Update: 2025-10-22 09:15 GMT

అజయ్ దేవగన్ నటించిన దేదే ప్యార్ దే సినిమాకి సీక్వెల్ గా వస్తున్న సినిమానే దే దే ప్యార్ దే 2.. ఈ సినిమా మొదటి భాగం సక్సెస్ అవ్వడంతో దీనికి సీక్వెల్ అనౌన్స్ చేశారు. అలా దేదే ప్యార్ దే 2 మూవీ ఈ ఏడాది నవంబర్ 14న థియేటర్లోకి రాబోతోంది. సీక్వెల్ పై ఇప్పటికే అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. అయితే తాజాగా దేదే ప్యార్ దే 2 మూవీ నుండి "రాత్ భర్" అనే పాటని మేకర్స్ రిలీజ్ చేశారు.. ఈ విషయాన్ని రకుల్ ప్రీత్ సింగ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అభిమానులతో పంచుకుంది. దేదే ప్యార్ దే -2 మూవీ నిర్మాతలు రాత్ భర్ అనే ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు.

ఈ పాటలో మీజాన్ జాఫ్రీ, రకుల్ ప్రీత్ సింగ్ తమ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా పట్ల ఇప్పటికే చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు విడుదలైన ఈ పాట కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. రాత్ భర్ సాంగ్ కి ఆదిత్య దేవ్, పాయల్ దేవ్ లు సంగీతం అందించగా..ఆదిత్య రిఖారి, పాయల్ దేవ్ ఇద్దరూ ఈ పాటను పాడారు.

తాజాగా విడుదలైన రాత్ భర్ పాట గురించి డైరెక్టర్ అన్షుల్ శర్మ మాట్లాడుతూ.. "మీజాన్ జాఫ్రీ,రకుల్ ప్రీత్ సింగ్ మధ్య ఏర్పడే కొత్త బంధాన్ని ఈ పాట ప్రదర్శిస్తుందని తెలిపారు.. రాత్ భర్ సాంగ్ కోసం పాయల్ , ఆదిత్య ఇద్దరు మంచి మ్యూజిక్ అందించారని, కుమార్ సాహిత్యం భావోద్వేగాలకు స్పష్టతను జోడించిందని, ఆదిత్య రిఖారి, పాయల్ దేవ్ లు తమ అద్భుతమైన గొంతుతో పాటకి ప్రాణం పోసారని డైరెక్టర్ తెలిపారు..

ఈ పాటకి లిరిక్స్ అందించి పాట పాడిన పాయల్ దేవ్ మాట్లాడుతూ.. "రాత్ భర్ అనే పాట మీ హృదయానికి ఎంతగానో హత్తుకుంటుందని "తెలిపారు. అలా తాజాగా విడుదలైన ఈ రొమాంటిక్ సాంగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.. దేదే ప్యార్ దే 2 మూవీ విషయానికి వస్తే.. ఈ మూవీ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది.. ఇందులో అజయ్ దేవగన్ తన చిన్ననాటి స్నేహితురాలు అయినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ కుటుంబాన్ని మెప్పించాలి అనుకుంటారు.. కానీ ఆ తర్వాత అజయ్ దేవగన్ వయసు రకుల్ తండ్రి వయసు అంత ఉంటుంది అనే విషయం తెలిసిన రకుల్ పేరెంట్స్ అజయ్ దేవగన్ తో పెళ్లికి ఒప్పుకోరు. అంతేకాకుండా రకుల్ ప్రీత్ సింగ్ కి మీజాన్ జాఫ్రీని ఇచ్చి పెళ్లి చేయడానికి చూస్తారు.అలా రకుల్,అజయ్ దేవగన్ ల మధ్యలోకి మీజాన్ జాఫ్రీ ఎంట్రీ ఇచ్చాక కథ కొత్త మలుపు తిరుగుతుంది? ఆ సమయంలో ఏం జరిగింది.. అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్ తల్లిదండ్రులను ఒప్పించడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి? ..అనేది ఈ కథలో చూపిస్తారు.. నవంబర్ 14న సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్,మాధవన్, గౌతమి కపూర్, జావేద్ జాఫేరి లు నటించారు



Full View


Tags:    

Similar News