బ్లాక్ కో ఆర్డ్ సెట్ లో జిగేలుమంటున్న రకుల్!

కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రకుల్ ప్రీత్ సింగ్.. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో నటిగా తనను తాను నిరూపించుకుంది.

Update: 2026-06-23 09:09 GMT

కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రకుల్ ప్రీత్ సింగ్.. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో నటిగా తనను తాను నిరూపించుకుంది. జయ జానకి నాయక , స్పీడున్నోడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో తెలుగు చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. దాదాపు 5 సంవత్సరాల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్.. చివరిగా టాలీవుడ్ లో కథల ఎంపిక విషయంలో కాస్త తడబడడంతో అవకాశాలు తగ్గిపోయాయి.




 


ట్రెండీ అవుట్ ఫుట్ లో రకుల్ అందాలు..

దాంతో చేసేదేం లేక బాలీవుడ్ కి మకాం మార్చిన ఈమె.. అక్కడే అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. అంతేకాదు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ఏడడుగులు కూడా వేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న రకుల్ మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే మరో లేటెస్ట్ అవుట్ ఫిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ కోఆర్డ్ సెట్ లో జిగేలుమనిపించేలా తన అందాలను ఆరబోసింది.




 


మ్యాక్సీ డ్రెస్ లో ఆకట్టుకుంటున్న రకుల్..

టోర్కాడోర్న్ అనే డిజైనర్ లేబుల్ కి చెందిన లీలా సీక్విన్స్ క్రాప్ టాప్.. దీనికి కాంబినేషన్లో మ్యాక్సీ స్కర్ట్ కో ఆర్డ్ సెట్ ను ధరించింది. స్క్వేర్ నెక్ స్లీవ్ లెస్ సీక్విన్డ్ క్రాప్ టాప్ ధరించింది. ఇక స్కర్ట్ విషయానికి వస్తే. నడుము వద్ద బిగుతుగా ఉండి, శరీరానికి అతుక్కుపోయే మ్యాక్సీ స్కర్ట్ ఇది. ముఖ్యంగా ఒక సైడు స్లిట్ కూడా ఉంటుంది.నలుపు రంగు సీక్విన్డ్ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేసిన ఈ డ్రెస్ జిగేలుమనేలా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో ఈమె గ్లామర్ డోస్ దట్టించి మరీ ఫోటోలు షేర్ చేసింది. తాజాగా రకుల్ పంచుకున్న ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. పైగా ఈమె ధరించిన ఈ డ్రెస్ ఖరీదు సుమారుగా రూ.11 వేల నుండి రూ.12,000 మధ్య ఉన్నట్లు సమాచారం.




 


రకుల్ ప్రస్తుత సినిమాలు..

దేదే ప్యార్ దే 2 సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ప్రస్తుతం నితీష్ తివారి భారీ బడ్జెట్ చిత్రం రామాయణంలో రావణుడి చెల్లెలిగా సూర్పనక పాత్రలో నటిస్తోంది. ఇక అలాగే ఎస్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 3 సినిమాలో కూడా భాగమైంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూ అటు బిజీగా గడుపుతూనే ఇటు ఆడియన్స్ కు ఎప్పటికప్పుడు దగ్గర అవ్వడానికి ఇలా గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. ప్రస్తుతం రకుల్ షేర్ చేసిన ఈ లేటెస్ట్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

Tags:    

Similar News