ఇతరుల జీవితాలతో ఆడుకోవడం అలవాటు - రకుల్
దాంతో సౌత్ లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. అక్కడే అడపాదడపా సినిమాలలో చేస్తూనే.. ప్రముఖ నటుడు, బాలీవుడ్ నిర్మాత అయిన జాకీ భగ్నానీనీ ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.;
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో మంచి ప్రేక్షకాదరణ పొందిన ఈయన.. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోలకు జోడిగా నటించి, తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ తర్వాత కాలంలో ఈమె నటించిన చిత్రాలు డిజాస్టర్ గా నిలవడంతో అవకాశాలు తగ్గుముఖం పడ్డాయి. దీనికి తోడు మన్మధుడు 2 చిత్రంలో తండ్రి వయసున్న హీరో పక్కన హీరోయిన్ గా నటించడమే కాకుండా బోల్డ్ సన్నివేశాలలో నటించి అందరి చేత విమర్శలు కూడా ఎదుర్కొంది.
దాంతో సౌత్ లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. అక్కడే అడపాదడపా సినిమాలలో చేస్తూనే.. ప్రముఖ నటుడు, బాలీవుడ్ నిర్మాత అయిన జాకీ భగ్నానీనీ ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. వివాహం అనంతరం తన భర్త గురించి వచ్చిన రూమర్స్ పై స్పందించింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను సృష్టిస్తూ ఇతరుల జీవితాలతో ఆడుకోవడం అలవాటైపోయింది అంటూ ట్రోలర్స్ పై రూమర్స్ క్రియేట్ చేసే వారిపై మండిపడింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ పై స్పందిస్తూ.. ఇండస్ట్రీలో ఒడిదుడుకులు సహజమని చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్.. దివాలా తీసారని, కంపెనీ మూసేశారనే వార్తలపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. "క్లిక్స్ కోసం ఏమైనా రాసే సంస్కృతికి ప్రజలు అలవాటు పడ్డారు. వాస్తవానికి తప్పుడు వార్తలకు చాలా వ్యత్యాసం ఉంది. నిజానిజాలు నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను వాటిని పట్టించుకోలేదు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో భాగమైనప్పుడు కొన్ని విషయాల గురించి మౌనంగా ఉండటమే మంచిది. సమయం వచ్చినప్పుడు అసలు నిజం ఏమిటి అన్నది ప్రజలకే తెలుస్తుంది. జాకీ భగ్నానీ పై వార్తలు వచ్చినప్పుడు అతడు ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నాడో నాకు మాత్రమే తెలుసు.
కంపెనీ మూసేసారని రాశారు. అయితే ఆయన నిర్మాతగా వ్యవహరించిన మూడు సినిమాలు విజయం వరించలేదు అన్నమాట వాస్తవమే. కానీ కంపెనీ మూసివేయలేదు. ఆర్థికంగా నష్టపోయాం. ఇండస్ట్రీలో ప్రతి నిర్మాతకి కూడా నష్టం జరుగుతుంది. ఒకానొక సమయంలో అమితాబ్ బచ్చన్ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఎదుగుతున్న సమయంలో ఇది ఒక దశ. అన్నింటిని అధిగమించినప్పుడే మనం సక్సెస్ సాధిస్తాము. ముఖ్యంగా ఇతరుల జీవితాలతో ఆడుకోవడం కొంతమందికి అలవాటైపోయింది. అందుకే నిజానిజాలు తెలుసుకోకుండా ఎదుటివారి మనోభావాలను అర్థం చేసుకోకుండా తప్పుడు కథనాలను ప్రచురితం చేస్తున్నారు" అంటూ మండిపడింది రకుల్ ప్రీత్ సింగ్. ఇకపోతే అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన 'బడే మియా చోటే మియా' సినిమా డిజాస్టర్ గా మిగిలినప్పుడు ఈ వార్తలు వెలువడ్డాయి. ఏది ఏమైనా భారీ తారాగణంతో వచ్చిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడం వల్లే రకుల్ భర్త పై ఈ రూమర్స్ వినిపించాయి.