టాక్ ఆఫ్ ద టౌన్: ఆ సినిమా క్లైమాక్స్‌లో ఏముంది?

రాజు వెడ్స్ రాంబాయి.. ఈ వారం రిలీజవబోతున్న మూడు తెలుగు చిత్రాల్లో ఒకటి. అల్లరి నరేష్ సినిమా ‘12 ఏ రైల్వే కాలనీ’, ప్రియదర్శి మూవీ ‘ప్రేమంటే’తో ఈ చిత్రం పోటీ పడుతోంది.;

Update: 2025-11-20 19:16 GMT

రాజు వెడ్స్ రాంబాయి.. ఈ వారం రిలీజవబోతున్న మూడు తెలుగు చిత్రాల్లో ఒకటి. అల్లరి నరేష్ సినిమా ‘12 ఏ రైల్వే కాలనీ’, ప్రియదర్శి మూవీ ‘ప్రేమంటే’తో ఈ చిత్రం పోటీ పడుతోంది. వాటితో పోలిస్తే ఇది చిన్న సినిమా అయినప్పటికీ.. సోషల్ మీడియాలో బాగానే బజ్ క్రియేట్ చేయగలిగింది. అందుకు ప్రధాన కారణం.. ఇందులో చార్ట్ బస్టర్ అయిన ఒక పాట, ట్రైలర్. అలాగే టీం చేసిన ప్రమోషన్లు కూడా బాగానే కలిసొచ్చాయి.

‘రాజు వెడ్స్ రాంబాయి’ గురించి టీం చాలా గొప్పగా చెబుతోంది. అదే సమయంలో ఇండస్ట్రీ జనాల్లోనూ దీని గురించి చర్చ జరుగుతోంది. అడివి శేష్, కిరణ్ అబ్బవరం, తరుణ్ భాస్కర్, శివాజీ లాంటి వాళ్లు పనిగట్టుకుని ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ల గురించి దీని గురించి గొప్పగా మాట్లాడారు. నిన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా చాలామంది ‘రాజు వెడ్స్ రాంబాయి’ కథ గురించి ఒక రేంజిలో చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి బాగా చర్చ జరుగుతోంది.

తెలంగాణలోని ఒక పల్లెటూరిలో జరిగిన యదార్థ గాథతో దర్శకుడు సాయిలు ఈ సినిమా తీశాడు. ఈ కథలో ఒక షాకింగ్ విషయం ఉందట. ఇలాంటి విషయం ఎక్కడా జరిగి ఉండదని.. అది అందరినీ కదిలించేస్తుందని అంటున్నారు. ఆ కథ జరిగిన ఊరి నుంచి ఒక పెద్దాయన ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వచ్చి ముఖానికి కర్చీఫ్ కట్టుకుని ఏడుస్తూ ఈ కథ గురించి మాట్లాడాడు. 15 ఏళ్లుగా ఆ కథ తమ ఊరిని వెంటాడుతోందని.. ఇలా ఎవ్వరికీ జరగకూడదని ఆయన అన్నాడు.

ఇక సినిమా టీంలో ప్రతి ఒక్కరూ ‘రాజు వెడ్స్ రాంబాయి’లో చివరి అరగంట గురించి గొప్పగా చెప్పారు. సోషల్ మీడియాలో కూడా ఆ ‘అరగంట’ గురించి ఒక చర్చ నడుస్తోంది. దీంతో వాస్తవంగా ఆ ఊరిలో ఏం జరిగింది అని తెలుసుకోవాలన్న కుతూహలం అందరిలో కలుగుతోంది. సినిమాకు ఇదే బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ రోజు రాత్రి ‘రాజు వెడ్స్ రాంబాయి’కి పెయిడ్ ప్రిమియర్స్ పడుతున్నాయి. మరి అంతగా ఈ కథలో ఏముందన్నది ఆ ప్రిమియర్స్ తర్వాత బయటికి వచ్చేస్తుంది. మరి ఇది అంత వర్త్ ఉన్న కథేనా అన్నది చూడాలి.

Tags:    

Similar News