సూపర్ స్టార్ సినిమాపై ఆ ఇంపాక్ట్ ఉంటుందా..?

జైలర్ తో తిరిగి సూపర్ ఫాంలోకి వచ్చిన సూపర్ స్టార్ తన నెక్స్ట్ సినిమా కూలీతో డబుల్ ఎనర్జీతో కనిపిస్తున్నారు

Update: 2024-04-29 03:59 GMT

జైలర్ తో తిరిగి సూపర్ ఫాంలోకి వచ్చిన సూపర్ స్టార్ తన నెక్స్ట్ సినిమా కూలీతో డబుల్ ఎనర్జీతో కనిపిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కూలీ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ చూస్తే రజినీతో లోకేష్ మరో సూపర్ హిట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని అనిపిస్తుంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో ముడిపడే ఈ కూలీ ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే లోకేష్ సినిమా అన్నది పక్కన పెడితే కూలీ సినిమా మీద జైలర్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.

స్టార్ హీరో సినిమా సూపర్ హిట్ పడితే ఆ సినిమా తాలూఖా ఇంపాక్ట్ అన్నది నెక్స్ట్ సినిమా మీద ఉంటుంది. జైలర్ సినిమాతో నెల్సన్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన్ను ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా చూపించాడు. జైలర్ సినిమా రజినీ ఫ్యాన్స్ ఆకలి తీర్చేసింది. అయితే ఆ తర్వాత కూలీగా వస్తున్న లోకేష్ రజినీని డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.

జైలర్ తో రజినీ మేనరిజం స్టైల్ మొత్తం వాడేశాడు నెల్సన్. సో లోకేష్ చేస్తే ఏదైనా కొత్తగా చేయాల్సి ఉంటుంది. అయితే కూలీ టీజర్ చూసిన ఆడియన్స్ ఇది లోకేష్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా మాదిరిగానే ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం రజినీ నటిస్తున్న వేటయ్యన్ ఈ దసరాకి రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా తర్వాత లోకేష్ తో చేస్తున్న కూలీ వస్తుంది. కూలీ సినిమా టీజర్ లో జైలర్ రిఫరెన్స్ లు కనిపిస్తున్నాయి.

Read more!

లోకేష్ ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే మాత్రం కూలీ కాదు ఇది జైలర్ 2 అని అనుకుంటారు. కూలీ సినిమా గోల్డ్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో భారీ యాక్షన్ సినిమాగా వస్తుందని అర్థమవుతుంది. అంతేకాదు రజినీ ఒకప్పటి డైలాగ్ ని మళ్లీ ఇందులో పెట్టి సర్ ప్రైజ్ చేశాడు. సో విక్రం తరహాలోనే రజినీ ఓల్డ్ సినిమాలోని పాత్రతో దీన్ని కనెక్ట్ చేసి కూలీ సినిమాను కూడా తన యూనివర్స్ లో ఒక క్రెజీ ప్రాజెక్ట్ గా చేస్తాడా ఏంటని ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఏది ఏమైనా సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం కమల్ కు విక్రం తో ఎలాంటి హిట్ పడిందో రజినీకి కూడా కూలీతో అలాంటి బ్లాక్ బస్టర్ రావాలని ఆశిస్తున్నారు.

Tags:    

Similar News