మంచు మనోజ్.. ఇప్పటికైనా స్పీడ్ పెంచితే చాలు!

టాలీవుడ్ ప్రముఖ మంచు ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన టాలెంటెడ్ హీరో మంచు మనోజ్. తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. ఇప్పటికే పలు సినిమాలతో మెప్పించిన విషయం తెలిసిందే.;

Update: 2025-09-06 03:45 GMT

టాలీవుడ్ ప్రముఖ మంచు ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన టాలెంటెడ్ హీరో మంచు మనోజ్. తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. ఇప్పటికే పలు సినిమాలతో మెప్పించిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ అందుకున్నారు. తన నటనతో అలరించారు. కానీ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఇండస్ట్రీకి సడెన్ గా దూరమయ్యారు.

పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు రీ ఎంట్రీ విషయంలో పక్కా ప్లాన్ తో ఉన్నారు. వచ్చిన ఏ ఛాన్స్ ను కూడా వదులుకునేలా కనిపించడం లేదు. ఇప్పుడు హీరోగా.. కీలక రోల్స్ లో నటిస్తూ సక్సెస్ కోసం బాటలు వేస్తున్నారు. ఇటీవల భైరవం మూవీతో రీ ఎంట్రీలో తొలి అడుగు వేశారు. ప్రశంసలు అందుకున్నారు.

చాలా మంది మోహన్ బాబు యాక్టింగ్ మనోజ్ కనపడిందని ప్రశంసలు కురిపించారు. నటనకు మంచి మార్కులు వేశారు. ఇప్పుడు మిరాయ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మనోజ్. అందులో విలన్ గా కనిపించనున్నారు. తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్ కానుంది.

ఇప్పటికే మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. మనోజ్ లుక్ కు, విలనిజానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ట్రైలర్ ను రీసెంట్ గా మనోజ్.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కు చూపించారు. మొత్తం చూసిన ఆయన.. మంచు హీరోకు క్లాస్ పీకారు. సినిమాలు చేయకుండా ఏం చేస్తున్నావ్ అంటూ గట్టిగా అరిచారు. మనోజే ఈ విషయాన్ని రివీల్ చేశారు.

ఇకపై మంచి మంచి సినిమాలు చేయమని రజినీ చెప్పారని, సినిమాలకు గ్యాప్ ఇవ్వొద్దని చెప్పినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు రజినీ క్లాస్ పీకడం కరక్టేనని అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు కెరీర్ పై సీరియస్ గా ఫోకస్ చేయాలని.. మేకర్స్ అంతా మనోజ్ తో మంచి సినిమాలు తీసేందుకు వెయిట్ చేస్తున్నారని చెబుతున్నారు.

మార్కెట్ తగ్గినా.. మనోజ్ కు క్రేజ్ అలానే ఉందనే చెప్పాలి. కాబట్టి దాన్ని చక్కగా మనోజ్ వాడుకోవాలి. ఇప్పుడు మిరాయ్ లో పెద్ద స్కోప్ ఉన్న రోల్ దక్కినట్లు కనిపిస్తుంది. అప్ కమింగ్ ప్రాజెక్టులు కూడా గట్టి సౌండ్ తోనే వినిపిస్తున్నాయి. అందుకే మనోజ్ స్పీడ్ పెంచి వరుస సినిమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

హీరోగానే కాకుండా విలన్ గా చేసే అవకాశాలు కూడా వదులుకోవద్దని నెటిజన్లు సూచిస్తున్నారు. అసలుకే టాలీవుడ్ లో విలన్ల కొరత ఉందని గుర్తు చేస్తున్నారు. కాబట్టి మనోజ్ ట్రాక్ లోకి వస్తే ఆ లోటు తీరుతుందని చెబుతున్నారు. అదే సమయంలో ఆయనకు కూడా తిరుగుండదని అంటున్నారు. మరి మనోజ్ ఏం చేస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News