‘జైలర్ 2’: ఈసారి ఫ్యామిలీ వర్సెస్ ఫ్యామిలీ.. ఆ పాత్రతో అసలు ట్విస్ట్

ఒక బ్లాక్‌బస్టర్ సినిమాకి సీక్వెల్ తీయడం కత్తి మీద సాము లాంటిది. 'జైలర్' లాంటి ఇండస్ట్రీ హిట్‌కు సీక్వెల్ తీయాలంటే, డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ మీద ఒత్తిడి మామూలుగా ఉండదు.;

Update: 2025-10-26 11:30 GMT

ఒక బ్లాక్‌బస్టర్ సినిమాకి సీక్వెల్ తీయడం కత్తి మీద సాము లాంటిది. 'జైలర్' లాంటి ఇండస్ట్రీ హిట్‌కు సీక్వెల్ తీయాలంటే, డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ మీద ఒత్తిడి మామూలుగా ఉండదు. ఫస్ట్ పార్ట్‌లో రజినీకాంత్ స్వాగ్, అనిరుధ్ బీజీఎం, స్టార్ కాస్టింగ్ గెస్ట్ రోల్స్ అదిరిపోయాయి. కానీ, ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయడం కుదరదు, దాన్ని మించిపోవాలి. అందుకే నెల్సన్ ఈసారి కేవలం గెస్ట్ రోల్స్ మీద కాకుండా, కథనం మీద గట్టిగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.

'జైలర్ 1'లో విలన్ గ్యాంగ్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ 'జైలర్ 2'లో ఆ విలనిజాన్ని మరో లెవల్‌కు తీసుకెళ్లబోతున్నారు. ఈసారి ముత్తువేల్ పాండియన్ (రజినీ) ఢీకొట్టేది ఒక సింగిల్ విలన్‌తో కాదు, ఏకంగా ఒక 'విలన్ ఫ్యామిలీ'తో అని గట్టిగా టాక్ నడుస్తోంది. ఈ పాయింటే సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ విలన్ సామ్రాజ్యానికి హెడ్‌గా బాలీవుడ్ సీనియర్ స్టార్ మిథున్ చక్రవర్తిని ఫిక్స్ చేశారని సమాచారం.

అయితే, ఈ విలన్ గ్యాంగ్‌లో అసలైన సర్‌ప్రైజ్ ప్యాకేజ్ లో మరొకరు ఉన్నారు. ఆ పాత్ర కోసమే నేషనల్ అవార్డ్ విన్నర్, బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ విద్యా బాలన్‌ను రంగంలోకి దించుతున్నారని తెలుస్తోంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. విద్యా బాలన్ ఈ సినిమాలో రజినీకి జోడీగానో, మరో కీలక పాత్రలోనో కాకుండా.. ఏకంగా మెయిన్ విలన్ అయిన మిథున్ చక్రవర్తి కూతురిగా నటించబోతున్నారట.

ఈ ఒక్క పాయింట్ చాలు, సినిమా రేంజ్ అర్థం చేసుకోవడానికి. 'జైలర్ 1'లో రజినీ తన ఫ్యామిలీని కాపాడుకోవడం చూశాం. ఇప్పుడు 'జైలర్ 2'లో కథ పూర్తిగా మారనుంది. ఇది హీరో వర్సెస్ విలన్ ఫైట్ కాదు, 'ముత్తువేల్ పాండియన్ ఫ్యామిలీ' వర్సెస్ 'విలన్ ఫ్యామిలీ' అన్నట్లుగా కథనం నడవబోతోంది. ఒకవైపు రమ్యకృష్ణ, మిర్నా మీనన్ (రజినీ ఫ్యామిలీ) ఉండగా, మరోవైపు మిథున్, విద్యా బాలన్ (విలన్ ఫ్యామిలీ) ఉండబోతున్నారు.

విలన్ కూతురిగా విద్యా బాలన్ పాత్ర ఎలా ఉండబోతోంది? ఆమె కూడా తండ్రిలాగే క్రూరంగా ఉంటుందా? లేక ఆ విలన్ గ్యాంగ్‌లోనే ఒక ఎమోషనల్ వీక్ పాయింట్‌గా మారుతుందా? అనేది స్క్రీన్‌పై చూసి తీరాలి. సన్ పిక్చర్స్ ఈ సినిమాను ఫస్ట్ పార్ట్‌ను మించిన స్కేల్‌లో నిర్మిస్తోంది. అనిరుధ్ మ్యూజిక్ మరోసారి గూస్‌బంప్స్ తెప్పించడానికి రెడీ అవుతున్నాడు.

Tags:    

Similar News