మహావతార్ బాబాజీ గుహలో సూపర్ స్టార్..!
కేవలం పర్యటనకు వెళ్లడం మాత్రమే కాకుండా రజనీకాంత్ అత్యంత ప్రశాంత వాతావరణంలో, ప్రమాదకర ప్రాంతంలో ఒంటరిగా ధ్యానం చేయడం మన చూస్తూ ఉంటాం.;
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం హిమాలయ యాత్రలో ఉన్నారు. ఆయన ప్రతి ఏడాది హిమాలయ యాత్ర చేయడం, అక్కడ కొన్ని రోజుల పాటు ప్రశాంత వాతావరణంను ఆస్వాదించడం చేస్తూ ఉంటారు. అయితే అనారోగ్య కారణాల వల్ల, వయసు పెరిగిన రీత్యా రజనీకాంత్ హిమాలయ యాత్ర రద్దు చేసుకుంటే మంచిది అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేశారు. కానీ రజనీకాంత్ మాత్రం తాను అనుకున్నట్లుగానే ముందుకు సాగారు. ప్రస్తుతం హిమాలయాల్లో క్వాలిటీ టైంను స్పెండ్ చేయడంతో పాటు, ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నారు, రోడ్డు సైడ్ ఫుడ్‌ను ఆస్వాదిస్తూ, ఒక సింపుల్ జీవితాన్ని సాగిస్తున్నారు. ఏ ఒక్క సూపర్ స్టార్‌కి సాధ్యం కాని లైఫ్ ను రజనీకాంత్ అక్కడ లీడ్ చేస్తున్నారు అనేది ఇటీవల నెట్టింట వచ్చిన ఫోటోలు, వీడియోలను చూస్తే అర్థం అవుతుంది.
హిమాలయ పర్యటనలో రజనీకాంత్
రజనీకాంత్ హిమాలయ పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్‌కి మాత్రమే ఇలా సాధ్యం అంటూ చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. సెలబ్రిటీ కాక పోయినా అక్కడ అంత సింపుల్ జీవితాన్ని ఎవరూ సాగించలేరు అనేది కొందరి మాట. రజనీకాంత్ మాదిరిగా అలా సింపుల్‌గా, హిమాలయాల్లో లైఫ్ ను కొనసాగించే అవకాశం వస్తే బాగుండు అని చాలా మంది ఈ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. రజనీకాంత్ సింప్లిసిటీ గురించి ఎన్నో సార్లు, ఎన్నో విధాలుగా చూశాం. ఇప్పుడు మరోసారి ఆయన హిమాలయ పర్యటన సందర్భంగా ఆయన సింప్లిసిటీ గురించి చూస్తూ ఉన్నామని ఫ్యాన్స్ తెగ ఈ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. రజనీకాంత్ ఈ వయసులోనూ ఇంత యాక్టివ్‌గా ఉండటానికి ఇలాంటి ప్రశాంత వాతావరణం కారణం అని కొందరు అంటున్నారు.
సింపుల్ ఔట్ ఫిట్‌లో సూపర్ స్టార్
కేవలం పర్యటనకు వెళ్లడం మాత్రమే కాకుండా రజనీకాంత్ అత్యంత ప్రశాంత వాతావరణంలో, ప్రమాదకర ప్రాంతంలో ఒంటరిగా ధ్యానం చేయడం మన చూస్తూ ఉంటాం. ఈ సారి కూడా ఆయన మహావతార్ బాబాజీ గుహ వద్ద ధ్యానం చేస్తూ కనిపించారు. ధ్యానం చేస్తున్న సమయంలో రజనీకాంత్ సింపుల్ వేర్‌ను ధరించారు. బ్లాక్ కలర్ షర్ట్ ను ధరించిన ఆయన వైట్ కలర్ పాయింట్‌ను ధరించి చాలా సింపుల్‌గా కనిపించారు. తలపై టోపీ ధరించి ఉన్న రజనీకాంత్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తనను పలకరించేందుకు వచ్చిన అభిమానులతో మాట్లాడుతూ, వారితో సరదా ముచ్చట్లు చెబుతూ సమయంను స్పెండ్ చేస్తూ కనిపించాడు. ధాన్యం సమయంలో మాత్రం ఆయన ఎక్కువ సమయం మౌనంగా ఉన్నారు. ఆయన్ను మరెవ్వరూ కలువకుండా ఆయన సన్నిహితులు చూసుకున్నారు.
జైలర్ 2 కోసం రజనీకాంత్ ఫ్యాన్స్ ఎదురు చూపులు
ఇక రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన 'కూలీ' సినిమా వచ్చింది. ఆ సినిమాకు తమిళనాట బాగానే వసూళ్లు వచ్చాయి. కానీ సినిమా ఓవరాల్ ఫలితం విషయంలో స్వయంగా రజనీకాంత్ ఫ్యాన్స్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. లోకేష్ కనగరాజ్ తన మార్క్‌ను మిస్ చేశాడు అంటూ ట్రోల్స్ వచ్చాయి. ప్రస్తుతం జైలర్ 2 సినిమా రూపొందోతుంది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రజనీకాంత్ ముఖ్య పాత్రలో ఈ సినిమా రూపొందుతోంది.
గతంలో వచ్చిన జైలర్ కి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శకుడు చెబుతున్నాడు. జైలర్ సినిమాకు సంగీతం ఇచ్చిన అనిరుథ్ జైలర్ 2 సినిమా కోసం పని చేస్తున్నాడు. మొదటి పార్ట్ భారీ వసూళ్లు రాబట్టిన నేపథ్యంలో రెండో పార్ట్ అంతకు మించిన వసూళ్లు సాధిస్తుందనే విశ్వాసంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.