సూపర్ స్టార్ ముందు బిగ్ టార్గెట్ సాధ్యమేనా?
సూపర్ స్టార్ రజనీకాంత్ -లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న `కూలీ` పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు.;
సూపర్ స్టార్ రజనీకాంత్ -లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న `కూలీ` పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా సరైన ప్రచార చిత్రాలు రిలీజ్ కానప్పటకీ లోకేష్ -రజనీ అనే బ్రాండ్ తోనే అంచనాలు స్కైని టచ్ చేస్తున్నాయి. ఆ మోజులోనే పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు రైట్స్ ను ఏషియన్ సునీల్ నారంగ్ దక్కించుకున్నారు.
అందరూ 40 కోట్లు అంటే ఈయన మాత్రం మరో 12 కలిపి 52 కోట్లకు రైట్స్ తీసుకున్నారు. దీంతో రజనీకాంత్ పేరిట ఇదో రికార్డుగా మారింది. ఇంతవరకూ రజనీకాంత్ నటించిన ఏ సినిమా తెలుగులో ఇంత ధర పలకలేదు. తొలిసారి తెలుగు మార్కెట్ లో ప్రీ రిలీజ్ పరంగా రజనీకాంత్ ఓ రికార్డు క్రియేట్ చేసారు. సినిమాలో రజనీతో పాటు నాగార్జున, ఉపేంద్ర లాంటి స్టార్లు ఉండటంతో బిజినెస్ టైకూన్లు కూడా ఏమాత్రం ఆలోచించకుండా కాన్పిడెంట్ గా కొనేసారు.
ఇప్పుడీ సినిమా ముందున్న బిగ్ టార్గెట్ ఏంటి అంటే తెలుగు రాష్ట్రాల నుంచే ఈ చిత్రం 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాలి. అప్పుడే ఈ చిత్రాన్ని తెలుగు మార్కెట్ పరంగా సక్సెస్ గా గుర్తించాల్సి ఉంటుంది. కానీ ఈ వసూళ్లు పెద్ద విషయమేమి కాదు. లోకేష్ గత చిత్రాల ట్రాక్ చూస్తే విక్రమ్ 400 కోట్లు వరల్డ్ వైడ్ రాబట్టింది. అటుపై రిలీజ్ అయిన `లియో` 500 కోట్లకు పైగా సాధించింది. ఈ రెండు చిత్రాలు తెలుగు మార్కెట్ నుంచి మంచి వసూళ్లు రాబట్టాయి.
ఇక రజనీకాంత్ గత చిత్రాలు `2.0`, `జైలర్` లాంటి చిత్రాలు తెలుగు మార్కెట్ లో భారీ ఓపెనింగ్స్ తెచ్చిన చిత్రాలే. లాంగ్ రన్ లో ఈ చిత్రాలు తెలుగు మార్కెట్ నుంచి మంచి వసూళ్లు సాధించాయి. ఈ నేపథ్యం లో `కూలీ` ఆ రికార్డులన్నింటిని అధిగమించి సరికొత్త రికార్డులు సృష్టిస్తుందనే అంచనాలు బలంగా ఉన్నాయి.