కూలీకి ఇంత క్రేజ్ ఏంటి.. హాలిడే కాదు.. ఏకంగా అలాంటి పని చేస్తున్న కంపెనీలు!

కూలీ.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం కూలీ.;

Update: 2025-08-12 05:36 GMT

కూలీ.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం కూలీ. నాగార్జున మెయిన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కేమియో పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అలాగే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఊహించని ఇమేజ్, భారీ అంచనాల మధ్య ఆగస్టు 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పోస్టర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇకపోతే విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. అటు ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క నార్త్ అమెరికాలోనే ఇప్పటికే 2 మిలియన్ డాలర్లకి పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇదిలా ఉండగా సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా విడుదలవుతోంది అంటే చాలా కంపెనీల ఉద్యోగులు సెలవు తీసుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక బడా స్టార్ హీరోల సినిమాలు అయితే ఆయా కంపెనీలు కూడా ఆ రోజుల్లో సెలవు దినాలు కూడా ప్రకటిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఏకంగా సెలవు కాదు అలాంటి పని చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి ఆ కార్పొరేట్ కంపెనీలు.

ముఖ్యంగా ఈ కంపెనీలు చేస్తున్న పని చూస్తే రజినీకాంత్ కూలీ మూవీకి ఇంత క్రేజ్ ఏంటి స్వామి అంటూ ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పటికే ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభం అవ్వడంతో ఆయా కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు.. ఉదయం 9 గంటల షో కోసం ఏకంగా థియేటర్ లనే బుక్ చేసుకుంటూ ఉండడం గమనార్హం. 15 స్వాతంత్ర్య దినోత్సవం, 16 కృష్ణాష్టమి , 17 ఆదివారం కావడంతో ఈ మూడు రోజులు సెలవు దినాలు కాబట్టి ఆయా కంపెనీలు తమ ఉద్యోగుల కోసం ఉదయం 9 గంటల స్లాట్ ను బుక్ చేస్తూ ఏకంగా థియేటర్లోనే బుక్ చేసుకోవడం ఆశ్చర్యంగా మారింది. ఇకపోతే ఆయా థియేటర్ యాజమాన్యాలు కూడా కార్పొరేట్ కంపెనీలు చెప్పినట్టుగానే ఉదయం 9 గంటల షోకి ఏకంగా థియేటర్ లను బ్లాక్ చేస్తున్నారు.

వాస్తవానికి కబాలి సినిమా తర్వాత మళ్లీ ఈ రేంజ్ లో కార్పొరేట్ కంపెనీలు టికెట్లు బ్లాక్ చేయడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ చిత్రానికి పోటీగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్న వార్ 2 సినిమా కూడా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఈ సినిమాపై బజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. మరి రెండు భారీ చిత్రాలు ఆగస్టు 14న ఢీ కొట్టబోతున్నాయి. ఎలాంటి సక్సెస్ అందుకుంటాయో చూడాలి.

Tags:    

Similar News