కూలీతో రూ.300 కోట్ల క్లబ్ లోకి రజినీ.. హైయెస్ట్ మూవీస్ ఎవరివంటే?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రీసెంట్ గా కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రీసెంట్ గా కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఆ మూవీలో దేవ రోల్ లో కనిపించారు. ఎప్పటిలానే తన మార్క్ యాక్షన్ తో అలరించారు. మూవీతో మిక్స్ డ్ రిజల్ట్ అందుకున్నా.. వసూళ్లు బాగానే సాధిస్తున్నారు.
రిలీజ్ కు ముందు మూవీపై భారీ హైప్ క్రియేట్ అవ్వగా.. అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. దీంతో ఓపెనింగ్స్ అదిరిపోయేలా నమోదయ్యాయి. ఆ తర్వాత సెలవులు, వీకెండ్ కలిసి రావడంతో మంచి వసూళ్లు వచ్చాయి. అలా మూడు రోజుల్లో కూలీ మూవీ ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటేసి ఆ క్లబ్ లోకి అడుగుపెట్టింది.
అదే సమయంలో రజినీకాంత్ కెరీర్ లో రూ.300 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకున్న సినిమాగా కూలీ మూవీ నిలిచింది. ఇప్పటికే ఆయన నటించిన జైలర్ తోపాటు రోబో 2.0 సినిమాలు ఆ మార్క్ ను అందుకున్నాయి. రోబో, కబాలి వంటి చిత్రాలు.. రూ.300 కోట్ల క్లబ్ చేరువలోకి వచ్చాయి. కానీ ఆ మార్క్ ను మాత్రం అందుకోలేకపోయాయి.
ఇప్పుడు కూలీ మూవీ మాత్రం మూడు రోజుల్లో రూ.300 క్లబ్ లోకి చేరి సందడి చేసింది. కాగా.. ఓవరాల్ గా దక్షిణాది హీరోల్లో మాత్రం రూ.300 కోట్లు మార్క్ ను ఎక్కువ సార్లు అందుకున్న లిస్ట్ లో రజినీ కాంత్ మూడో ప్లేస్ లో ఉన్నారు. కూలీ తో పాటు ఆయన నటించిన మూడు సినిమాలు ఆ క్లబ్ లోకి చేరాయి.
అదే సమయంలో టాప్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్నారు. ఆయన నటించిన సినిమాల్లో ఇప్పటివరకు ఆరు చిత్రాలు రూ.300 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకున్నాయి. ఆయన తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ఉన్నారు. ఆయన యాక్ట్ చేసిన నాలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేశాయి.
మూడో ప్లేస్ లో మూడు సినిమాలతో రజినీ కాంత్ ఉండగా.. ఆయనతోపాటు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. తారక్ నటించిన వాటిలో మూడు సినిమాలు రూ.300 కోట్ల మార్క్ ను టచ్ చేశాయి. అయితే సౌత్ హీరోల్లో చాలా మంది వివిధ సినిమాల్లో నటిస్తున్నారు. కాబట్టి వారిలో అనేక మంది ఆ మార్క్ ను దాటేసే అవకాశం ఉంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.