విడుద‌ల‌కు ముందే ర‌జ‌నీ 'కూలీ' 250కోట్లు?

అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే, కూలీ చిత్రం విడుద‌లకు ముందే రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్ప‌టికే 250కోట్లు వ‌సూలు చేయ‌డం ఒక సంచ‌ల‌నం.;

Update: 2025-08-10 05:21 GMT

రికార్డుల‌ను తిర‌గ‌రాయ‌డం.. సంచ‌ల‌నాల‌కు తెర తీయ‌డం సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కి కొత్తేమీ కాదు. భార‌త‌దేశంలోనే అత్యంత భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ గా ర‌జ‌నీకాంత్ ద‌శాబ్ధాల పాటు బాక్సాఫీస్ వ‌ద్ద ఏల్తూనే ఉన్నారు. ఏడు ప‌దుల వ‌య‌సును అధిగ‌మించాక కూడా ఆయ‌న రికార్డులు బ్రేక్ చేస్తూ, సెన్సేష‌న్ కి కేరాఫ్ గా మారుతూ నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు. అత‌డు న‌టించిన జైల‌ర్ సంచ‌న‌ల విజ‌యం సాధించ‌డ‌మే గాక‌, శంక‌ర్ 2.0 (ర‌జ‌నీ క‌థానాయ‌కుడు) త‌ర్వాత 500 కోట్ల క్ల‌బ్ లో చేరిన చిత్రంగా నిలిచింది. ఈసారి ర‌జ‌నీ క‌చ్ఛితంగా మ‌రో 500 కోట్ల క్ల‌బ్ సినిమాని త‌న ఖాతాలో వేసుకునేందుకు రెడీ అవుతున్నారు. కూలీ కి ఉన్న భారీ క్రేజ్, ప్రీబ‌జ్ దృష్ట్యా 500 నుంచి 1000 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేస్తుంద‌ని ఇప్ప‌టికే ట్రేడ్ అంచ‌నా వేస్తోంది.

ప్రీబిజినెస్ పీక్స్..

లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కూలీ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల‌లో ఒక‌టి. ర‌జ‌నీకాంత్, నాగార్జున‌, అమీర్ ఖాన్, ఉపేంద్ర‌, శ్రుతిహాస‌న్ లాంటి స్టార్ల‌తో ఈ సినిమా అతి పెద్ద మ‌ల్టీస్టార‌ర్ చిత్రంగా ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా క్రేజ్ ను తెచ్చుకుంది. దానికి త‌గ్గ‌ట్టే ఇప్పుడు ప్రీరిలీజ్ బిజినెస్ లోను `కూలీ` సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఈ చిత్రం ర‌జ‌నీ కెరీర్ బెస్ట్ గా నిలుస్తుంద‌ని ఇప్ప‌టికే సూచ‌న‌లు అందాయి.

375 కోట్ల బడ్జెట్ మూవీ..

అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే, కూలీ చిత్రం విడుద‌లకు ముందే రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్ప‌టికే 250కోట్లు వ‌సూలు చేయ‌డం ఒక సంచ‌ల‌నం. ఇది ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన లియో రికార్డుల‌ను కూడా అధిగ‌మించింది.

36 సంవత్సరాల తర్వాత రజనీకాంత్ నటించిన తొలి A రేటింగ్ మూవీగా కూలీ గురించి చ‌ర్చ సాగుతోంది.ఈ చిత్రం ఆగ‌స్టు 14న అత్యంత క్రేజీగా విడుద‌ల‌వుతోంది. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమ‌య్యాయి. దాదాపు రూ. 375 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం విడుద‌ల‌కు చాలా ముందే 250కోట్లు వ‌సూలు చేసింది.

భారీ మొత్తానికి డీల్ :

ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రూపంలో ఇప్ప‌టికే భారీ మొత్తాలు నిర్మాత‌కు అందాయి. ఈ సినిమా త‌మిళ‌నాడు స‌హా అంతర్జాతీయ మార్కెట్లోను హ‌వా సాగిస్తోంది. సాంకేతికంగా అత్యుత్త‌మంగా తెర‌కెక్కిన కూలీ డిజిటల్, మ్యూజిక్, శాటిలైట్ హక్కుల అమ్మకం ద్వారా ఇప్పటికే రూ. 250 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంట‌ర్నేష‌న‌ల్ రైట్స్ రూపంలో 68కోట్ల డీల్ కుదిరింది. ఇప్ప‌టివ‌ర‌కూ త‌మిళంలో రెండో అతిపెద్ద డీల్ ఇద‌ని శాక్ నిల్క్ విశ్లేషించింది. ఇప్పటికే విదేశాలలో ముందస్తు బుకింగ్‌ల ద్వారా కూలీ రూ. 30 కోట్లు రాబ‌ట్టింది. దీనితో ఈ చిత్రం అంతర్జాతీయ మార్కెట్లలో తమిళ చిత్రానికి అతిపెద్ద ఓపెనింగ్‌ను సాధించే అవకాశం ఉందని కూడా అంచ‌నా వేస్తున్నారు.

ఉత్త‌రాదినా కూలీ హ‌వా?

యాధృచ్ఛికంగా లోకేష్ క‌న‌గరాజ్ తెర‌కెక్కించిన `లియో` రికార్డుల‌ను కూడా కూలీ అధిగ‌మించింది. లియో (2023) విదేశీ టెరిట‌రీ నుండి ప్రారంభ రోజున రూ. 66 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు అంత‌కుమించి కూలీ వ‌సూలు చేయ‌బోతోందని అంచ‌నా. ఇక కూలీ వేకువ‌ఝాము షోలను ఇటు తెలుగు రాష్ట్రాలు స‌హా కర్నాట‌క‌, కేర‌ళ‌లోను భారీగా ప్లాన్ చేసారు. దీని ద్వారా వ‌సూళ్లు అంత‌కంత‌కు పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాదినా కూలీ ప్ర‌భంజ‌నం సృష్టించ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు. ర‌జ‌నీ సినిమాలు నిజానికి నార్త్ బెల్ట్ లో ఆరంభం నెమ్మ‌దిగానే మొద‌ల‌వుతాయి. కానీ లోకేష్ క‌న‌గ‌రాజ్ ఫ్యాక్ట‌ర్ తో ఇప్పుడు కూలీకి ఉత్త‌రాదినా బ‌జ్ నెల‌కొంద‌ని ట్రేడ్ చెబుతోంది. కూలీ ర‌జ‌నీకాంత్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కావాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Tags:    

Similar News