సూపర్ స్టార్ కూడా మెగాస్టార్ రూట్లోనే!
ఈ నేపథ్యంలో ఎలాంటి స్టోరీతో వస్తున్నారనే చర్చ మొదలైంది. దీంతో ఈ సినిమా కథ ఫ్యామిలీ నేపథ్యంలో సాగే ఎంటర్ టైనర్ కి హాస్యాన్ని జోడించి తయారు చేసిన కథగా ప్రచారం జరుగుతోంది.;
మెగాస్టార్ చిరంజీవి తరహాలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారా? చిరు తరహాలోనే కూల్ గా సాగిపోయే కథలో కనిపించనున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. చిరంజీవి హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో `మన శంకరవరప్రసాద్ గారు` అనే హిలేరియస్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే చాలా కాలం తర్వాత సినిమా కామెడీ నేపథ్యంలో చేస్తోన్న చిత్రమిది. కెరీర్ ఆరంభంలో చిరంజీవి కొన్ని కామెడీ కథల్లో కనిపించారు. అటుపై లాంగ్ జర్నీలో నూ చాలా చిత్రాల్లో తనమార్క్ కామెడీని వర్కౌట్ చేసుకుంటూ వచ్చారు.
కానీ కొంత కాలంగా కామెడీకైతే పూర్తిగా దూరమయ్యారు. ఈనేపథ్యంలో అనీల్ వినిపించిన కామెడీ స్టోరీకి లాక్ అయ్యారు. చిరంజీవి ఎంతో లైక్ చేసి చేస్తోన్న చిత్రమది. స్టోరీ వింటున్నప్పుడే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకు బన్నానని..తెరపై చూసిన తర్వాత ఊప్రేక్షకులు అంతకు మించి నవ్వుతారని ధీమా వ్యక్తం చేసారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి రాబోయే 173వ చిత్రం కూడా ఇదే కామెడీ నేపథ్యంలో సాగే చిత్రమని కొలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది. శిబి చక్రవర్తి దర్శకత్వంలో రజనీకాంత్ ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎలాంటి స్టోరీతో వస్తున్నారనే చర్చ మొదలైంది. దీంతో ఈ సినిమా కథ ఫ్యామిలీ నేపథ్యంలో సాగే ఎంటర్ టైనర్ కి హాస్యాన్ని జోడించి తయారు చేసిన కథగా ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ కామెడీ టైమింగ్ ని బేస్ చేసుకుని అతడి పాత్రని కామిక్ గా హైలైట్ చేస్తున్నారుట. రజనీతో కాంబినేషన్ సన్నివేశాల కోసం `నరసింహ` చిత్రంలో నటించిన నటీనటుల్ని తీసుకుంటున్నారుట. శిబి చక్రవర్తి గత సినిమా `డాన్` తోనే ప్రేక్షకుల్ని నవ్విం చాడు. ఏడిపించాడు. ఎమోషనల్ గా కథని ప్రేక్షకులకు కనెక్ట్ చేయడం లో నూరుశాంత సక్సెస్ అయ్యాడు.
ఆ విజయం చూసే రజనీకాంత్ పిలిచి అవకాశం ఇచ్చారు. గత కొంత కాలంగా రజనీ దర్శకుల్ని అలాగే ఎంపిక చేస్తున్నారు. కేవలం వసూళ్లు మాత్రమే కాదు. కథని ఎంత బలంగా రాయగలరు..దాన్ని ఎంత కన్విన్సింగ్ గా చెబుతున్నారు? వంటి విషయాలను ప్రామాణికంగా తీసుకుని అవకాశం కల్పిస్తున్నారు. స్టోరీ పరంగా రజనీకాంత్ ఇన్వాల్వ్ మెంట్ కూడా ఉంటుంది. వరుసగా యాక్షన్ సినిమాలు చేసిన రజనీకాంత్ కి ఈ సినిమా ఓ విరామంలా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలకు అంతంగా ఆస్కారం లేదు. అలా ఇద్దరి క్రియేటివిటీ ఆధారంగా ప్రాజెక్ట్ లాక్ అయింది.