వార్ -2 vs కూలీ.. ఫస్ట్ డే బాక్సాఫీస్ లెక్కలు ఇలా..

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీతోపాటు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్- బాలీవుడ్ ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ -2 చిత్రాలు రిలీజ్ అయ్యాయి;

Update: 2025-08-15 10:33 GMT

బాక్సాఫీస్ వద్ద ఈ వీక్ బిగ్ క్లాష్ జరిగిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీతోపాటు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్- బాలీవుడ్ ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ -2 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు.. ఒకే రోజు విడుదల కావడంతో థియేటర్ల వద్ద సందడి మామూలుగా లేదు.

రెండు వేర్వేరు ఇండస్ట్రీలకు చెందిన సినిమాలు అయినా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద గట్టిగా పోటీ పడుతున్నాయి. రెండూ భారీ హోప్స్ తో రిలీజ్ అయినా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నాయి. అయితే మొదటి రోజు వసూళ్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరి ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. కూలీ, వార్ సీక్వెల్ ఫస్ట్ డే ఎంత రాబట్టాయంటే?

కూలీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేశారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్ అని తెలిపారు. అనుకున్నట్లే మేకర్స్ కూడా అదే అనౌన్స్ చేశారు. రిలీజ్ రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన తమిళ్‌ మూవీగా నిలిచినట్లు చెప్పారు. రూ.151+ కోట్లు కలెక్ట్ చేసినట్లు వెల్లడించారు.

కూలీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ (అంచనా)

తమిళనాడు - రూ.43.87 కోట్లు

తెలుగు రాష్ట్రాలు - రూ.17.09 కోట్లు

హిందీ వెర్షన్ - రూ.5.04 కోట్లు

కన్నడ వెర్షన్ - రూ.0.55 కోట్లు

ఓవర్సీస్ (అన్ని భాషలు) - రూ.17 కోట్లు+

వరల్డ్ వైడ్ టోటల్ - రూ.150 కోట్లు+ (అంచనా)

మరోవైపు, వార్ 2 మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేశారు. సుమారు 82 కోట్ల గ్రాస్‌ తో మొదటి రోజు ముగిసినట్టు అంచనాలు ఉన్నాయి. 100 కోట్ల ఓపెనింగ్ వసూళ్లు సాధిస్తుందని అందరూ భావించారు, కానీ అది జరగలేదు. RRR, దేవర తర్వాత 100 కోట్ల ఓపెనింగ్స్ సాధించిన హ్యాట్రిక్‌ ను తారక్ మిస్ అయ్యారు.

మొత్తం కలెక్షన్స్ (అంచనా)

హిందీ ఏరియా: రూ.31.97 కోట్లు (గ్రాస్)

తెలుగు రాష్ట్రాలు: రూ.19.38 కోట్లు (గ్రాస్)

తమిళనాడు: రూ.0.25 కోట్లు (గ్రాస్)

అయితే ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. మొదటి రోజు వార్ 2 కంటే కూలీ పైచేయి సాధించిందనే చెప్పాలి. సెలవు రోజులు, మౌత్ టాక్ బట్టి వసూళ్ల లెక్కలు మారుతాయి. అసలైన ఫలితం మాత్రం వారాంతం ముగిసే సరికి తెలుస్తుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.. ఏ సినిమా ఎంత వసూలు చేస్తుందో..

Tags:    

Similar News