రాజేంద్రప్రసాద్.. మళ్లీ అదే రిపీట్..
టాలీవుడ్ సీనియర్ యాక్టర్ రాజేంద్రప్రసాద్ కొద్ది రోజులుగా తన స్పీచ్ లతో తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.;

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ రాజేంద్రప్రసాద్ కొద్ది రోజులుగా తన స్పీచ్ లతో తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కమెడియన్ అలీ, సీనియర్ నటి రోజాపై కామెంట్స్ చేశారు. అంతకుముందు రాబిన్ హుడ్ ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ ను ఓ పదంతో సంబోధించారు. దీంతో అవి దుమారాన్ని రేపాయి.
టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్టుల్లో టాప్ లో ఉండే ఆయన.. అలా మాట్లాడకూడదని అనేక మంది అభిప్రాయపడ్డారు. అసలు ఏమవుతుందని క్వశ్చన్ చేశారు. ఎంత డ్యామేజ్ చేసుకుంటున్నారో చూసుకోవడం లేదని కామెంట్స్ పెట్టారు. ఆ తర్వాత ఆయన సారీ చెప్పారు. మళ్లీ అలా మాట్లాడనని అన్నారు. కానీ ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో మళ్లీ సీన్ రిపీట్ చేశారు.
"ఆడిటోరియంలో 99.9 శాతం మంది నా సినిమాలు చూసే పెద్దయ్యారు. ఇది బెజవాడ లాగానే అనిపిస్తుంది. డల్లాస్ లో ఉన్న ఒక ఆయన.. ఎప్పుడు ఇంటికి వెళ్లాలనిపిస్తే మీ సినిమా చూస్తా అన్నాడు. అప్పుడు నీవే కాదు నాయనా.. భారత ప్రధాని పీవీ నరసింహారావు కేసులు, సూట్ కేసుల్లో ఉన్నప్పుడు నా సినిమా చూసి.. ప్రసాద్ మంచి నవ్విస్తారాయనని అన్నారు. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ వాళ్లు డాక్టరేట్ ఇచ్చారు" అని తెలిపారు.
"డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ప్రతి తెలుగు ఇంట్లో మంచం, కంచంలాగా రాజేంద్రప్రసాద్ సినిమా అని అన్నారు. నేను నిమ్మకూరులోని విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి ఇంట్లో పుట్టాను. అక్కడ మా అమ్మగారు నాకు జన్మనిచ్చారు. నటుడు అవ్వడమంటే ఈజీ కాదని, ఆయనే నన్ను మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చదివించారు" అని తెలిపారు.
"నా జీవితంలో తల్లిదండ్రులు తప్ప అన్నీ ఎన్టీఆరే. ఆయన ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీలో ఎందుకు పనికొస్తావు? అనే అనేవారు. ఒకప్పుడు సన్నంగా, దరిద్రంగా సత్యసాయి బాబా జట్టుతో ఉండేవాణ్ని. అప్పుడు నేను ఎందుకు పనికొస్తానో తెలియదు. భగవంతుడు ప్రతి మనిషికి తోవ చూపిస్తారు. చార్లిన్ చాప్లిన్ సినిమా చూశాక నేను కామెడీ హీరో అయ్యాను" అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
"మైత్రీ నవీన్ గారు నాతోనే ఫస్ట్ సినిమా చేశారు. కానీ ఆయన ఇందాక చెప్పలేదు. సినిమాల్లోనే పెళ్లి చేశారు.. షష్టిపూర్తి కూడా చేశారు. ఆ అవకాశం రావడం నా అదృష్టం. మీకు ఉపయోగపడే సినిమాలు చేస్తాను. నా మూవీలు చూసే అంతా పెరిగారు. తానాకు నాకు లింక్ ఉంది. అసోసియేషన్ పుట్టిన 1977లోనే నా కెరీర్ మొదలైంది. తానా వయసు నా వయసు రెండూ ఒకటే" అని అన్నారు.
ఆ తర్వాత మా గణేష్ గాడు ఏంటి.. దొ****శాడా అని వ్యాఖ్యానించారు. పక్క వాళ్లను నవిస్తున్నానని కాబట్టి తనను పిలుస్తున్నారని అన్నారు. ఐదు జెనరేషన్స్ తో పని చేశానని చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన కామెంట్స్ వైరల్ గా మారడంతో నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. తనను పొగుడుకునే సందర్భంలో ఇంటర్నేషనల్ వేదికపై మళ్లీ మాటలు తూలారని కామెంట్లు పెడుతున్నారు.
స్వర్గీయ పీవీ నరసింహారావు కేసులు, సూట్ కేసుల్లో సినిమాలు చూశారనడం షాకింగ్ గా ఉందని చెబుతున్నారు. తానా అసోసియేషన్ పుట్టిన 1977లోనే ఆయన ప్రస్థానం మొదలైతే అయింది కానీ.. అలా చెప్పడం ఎందుకని అంటున్నారు. సత్య సాయిబాబా జుట్టును పోల్చి అనడం అసలు కరెక్ట్ కాదని మండిపడుతున్నారు. వయసు పరంగా హుందాగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని అభిప్రాయపడుతున్నారు.