• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ పాత్రలు చేస్తే రాజశేఖర్...

ఆ పాత్రలు చేస్తే రాజశేఖర్ కెరీర్ కి తిరుగుండదు

| ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ లో జీవిత, జీవితం అంటూ రాజశేఖర్ చెప్పిన డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి.

By - Tupaki Desk
Update: 2023-12-04 01:30 GMT

టాలీవుడ్ లో ఒకప్పుడు హీరో, విలన్ రోల్స్ చేసి యాంగ్రీ యంగ్ మెన్ గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. నితిన్ హీరోగా రాబోతున్న 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలో రాజశేఖర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ లో జీవిత, జీవితం అంటూ రాజశేఖర్ చెప్పిన డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి. ప్రముఖ రచయిత వక్కంత వంశీ ఈ సినిమాను డైరెక్టర్ చేస్తున్నారు.

ఈ మూవీలో రాజశేఖర్ పాత్రని ఎంతో ఫన్నీగా డిజైన్ చేశారట వంశీ. ట్రైలర్ చూస్తేనే అది అర్థమవుతుంది. నిజానికి నితిన్ మూవీలో రాజశేఖర్ చేస్తున్నారంటే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలోనో లేకపోతే విలన్ పాత్రలోనో నటిస్తున్నారని అందరూ అనుకున్నారు. కానీ అలా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంటర్టైనింగ్ ఉన్న పాత్రలో రాజశేఖర్ కనిపించబోతున్నారు. అయితే రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ రోల్స్ కాకుండా విలన్ రోల్స్ ఎంచుకుంటే..

ఆయన కెరియర్ కి అది మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉందని సినీ జనాల్లో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాగూ మన టాలీవుడ్ కి విలన్ల కొరత ఉంది. ఆయన తోటి నటులు జగపతిబాబు, శ్రీకాంత్ ఇప్పటికే విలన్స్ గా వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్నారు. దీంతో రాజశేఖర్ కూడా అదే దారిలో అడుగులు వేస్తే బాగుంటుందని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ప్రజెంట్ రాజశేఖర్ రెమ్యూనరేషన్ కూడా అంతంత మాత్రంగానే ఉందని తెలుస్తోంది.

కాబట్టి ఈయన కనుక విలన్ రోల్స్ చేస్తే సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస ఆఫర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. రీసెంట్ టైమ్స్ లో గోపీచంద్ 'రామబాణం' సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా కొన్ని రీజన్స్ వల్ల రాజశేఖర్ ఆ సినిమాని వదులుకున్నారట. ఇక నుంచి అయినా ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ ఎంచుకుంటే ఆయన కెరీర్ కి ఏ మాత్రం తిరుగు ఉండదని అభిమానులు అంటున్నారు. ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో లాంగ్ గ్యాప్ తర్వాత రాజశేఖర్ బిగ్ స్క్రీన్ పై కనిపించబోతున్నారు.

మరి తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ సినిమా ఆయనకి ఎంతలా హెల్ప్ అవుతుందో చూడాలి. కాగా ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీపై ఆడియన్స్ లో మంచి హైప్ నెలకొంది. నితిన్ సరసన శ్రీలీలా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 8న ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేయనుంది.

Tags:    
  • Tollywood 
  • Rajasekhar 
  • Extraordinaryman 
  • Nithiin 
  • Sreeleela 
  • Vakantavamsi 

Similar News

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS