మెక్సికోలో 'వారణాసి' ప్రివ్యూ.. రాజమౌళి ఏం చెప్పారంటే..

అదే సమయంలో వారణాసి ప్రివ్యూ వీడియోను కూడా ప్రదర్శించారు. అందులో సినిమా రేంజ్, విజువల్స్, కాన్సెప్ట్‌ కోసం చెప్పడంతో ప్రేక్షకులు ఫిదా అయ్యారు.;

Update: 2026-04-25 05:38 GMT

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసిపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఆ చిత్రాన్ని గ్లోబల్ రేంజ్ లో తీసుకురావాలనే లక్ష్యంతో మూవీ టీమ్ స్పెషల్ ప్లాన్ తో ముందుకెళ్తోంది. ఇప్పటికే సినిమాపై పాన్ ఇండియా రేంజ్ లో భారీ హైప్ నెలకొనగా, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా సినిమా రీచ్‌ ను పెంచుతోంది.

రీసెంట్ గా మెక్సికోలో జరిగిన ఫేమస్ ఈవెంట్ కామిక్ కాన్ లో వారణాసి స్పెషల్ అట్రాక్షన్‌ గా నిలిచింది. ఆ వేడుకలో చిత్రానికి సంబంధించిన వివరాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ, గ్లోబల్ ఆడియన్స్‌ ను ఆకట్టుకునేలా టీమ్ ప్రత్యేకంగా ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్లలో ఒకరైన కార్తికేయ స్టేజీపై సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, ప్రాజెక్ట్‌ పై ఆసక్తిని మరింత పెంచారు.

అదే సమయంలో వారణాసి ప్రివ్యూ వీడియోను కూడా ప్రదర్శించారు. అందులో సినిమా రేంజ్, విజువల్స్, కాన్సెప్ట్‌ కోసం చెప్పడంతో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా రాజమౌళి వీడియో మెసేజ్ మొత్తం ఈవెంట్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ వీడియోలో ఆయన వారణాసి అని ఉన్న టీ షర్ట్ లో కనిపించారు.

వీడియో మెసేజ్ లో రాజమౌళి మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సివిలైజేషన్ పై తనకు ఉన్న ఆసక్తి గురించి చెబుతూ.. తన గత చిత్రం బాహుబలి సెట్స్ నిర్మాణానికి మెక్సికోలోని చిచెన్ ఇట్జా వంటి నిర్మాణాలు ఎంతో ఇన్స్పిరేషన్ గా నిలిచాయని పేర్కొన్నారు. అలాగే మెక్సికో ప్రజల కల్చర్ తో పాటు చరిత్ర గురించి తెలుసుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

ఆ తర్వాత తన కెరీర్ ను ప్రస్తావించారు. తన 25 ఏళ్ల సినీ ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు తన సినిమాలను ఆదరించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ చిత్రంతో వచ్చిన గ్లోబల్ రీచ్ తనకు కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు. ఆ సినిమాలోని నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకోవడం, వేర్వేరు దేశాల వారు దానిపై డ్యాన్స్ చేయడం తనకు ఆనందం కలిగించిందని వెల్లడించారు.

అదే సమయంలో తాను ఎందుకు సినిమాలు చేస్తున్నానో కూడా అర్థమైందని చెప్పారు. ప్రస్తుతం రాజమౌళి చేసిన ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై మరింత హైప్ పెంచుతున్నాయి. వారణాసితో వరల్డ్ వైడ్ గా అందరినీ ఆకట్టుకునేందుకు మూవీ టీమ్ వేస్తున్న ప్లాన్ పట్ల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి వారణాసి ఎలాంటి హిట్ అవుతుందో.. ఇండియన్ మూవీ రేంజ్ ను ఇంకెంత పెంచుతుందో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News