'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌.. జక్కన్న 'లాకప్' స్ట్రాటజీ

'బాహుబలి', 'RRR' తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా SSMB29 పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.;

Update: 2025-11-13 06:50 GMT

'బాహుబలి', 'RRR' తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా SSMB29 పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయిన రోజు నుంచి, ప్రతీ అప్‌డేట్ ఒక సంచలనమే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి బిగ్గెస్ట్ ఈవెంట్ "గ్లోబ్ ట్రాటర్". నవంబర్ 15 జరగనున్న ఈ ఈవెంట్ కోసం జక్కన్న సెట్ చేసిన రూల్స్ ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తంలో "టాక్ ఆఫ్ ది టౌన్"గా మారాయి.

నిజానికి, జక్కన్న తన గేమ్ ప్లాన్‌ను పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. మొదట, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ఉన్న భయంకరమైన విలన్ 'కుంభ' (పృథ్వీరాజ్ సుకుమారన్) లుక్‌ను వదిలాడు. ఆ తర్వాత, చీర కట్టి గన్ పట్టిన పవర్‌ఫుల్ 'మందాకిని' (ప్రియాంక చోప్రా)ను పరిచయం చేశాడు. ఇప్పుడు, అందరూ వెయిట్ చేస్తున్న అసలైన హీరో, మహేష్ బాబు ఫస్ట్ లుక్‌ను మాత్రం ఆ గ్రాండ్ ఈవెంట్‌లోనే రివీల్ చేయాలని దాచిపెట్టాడు.

ఈవెంట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెటప్ రెడీ అవుతోంది. అయితే, అసలు కిక్ అంతా జక్కన్న పెట్టిన రూల్స్‌లోనే ఉంది. ఈ ఈవెంట్‌కు మీడియా కెమెరాలకు "నో ఎంట్రీ" అని చెప్పడం కామన్. కానీ, "జర్నలిస్టులు కూడా తమ మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేయాలి" అనే రూల్ పెట్టడమే ఇప్పుడు అసలైన షాక్. రాజమౌళి తన సినిమా విజువల్స్ విషయంలో, ముఖ్యంగా మహేష్ బాబు లుక్ విషయంలో ఎంత పకడ్బందీగా, ప్రొటెక్టివ్‌గా ఉన్నాడో చెప్పడానికి ఈ ఒక్క రూల్ చాలు.

మహేష్ బాబు ఫస్ట్ లుక్.. ఒక లీక్డ్ ఫోటోలా కాకుండా, తను ప్లాన్ చేసినట్టే ఆ మెగా స్క్రీన్ మీద, ఆ లైవ్ స్ట్రీమింగ్‌లో ఆడియన్స్‌కు ఒక "ఎక్స్‌పీరియన్స్"గా ఇవ్వాలని జక్కన్న ప్లాన్. లోపలికి ఫోన్ వెళ్తే, ఆ ఎక్స్‌పీరియన్స్ మొత్తం డ్యామేజ్ అవుతుందని ఆయనకు తెలుసు. ఇప్పుడు మీడియాకే ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటే, ఇక ఈవెంట్‌కు హాజరయ్యే ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? వాళ్లపై కూడా ఇలాంటి పరిమితులు ఉంటాయా? అనే అనుమానాలు మొదలయ్యాయి.

ఇప్పటికే ఈవెంట్ స్ట్రీమింగ్ హక్కులను హాట్ స్టార్ కు ఇచ్చిన విషయం తెలిసిందే. చూస్తే ఎవరైనా అందులోనే చూడాలనే ఆలోచనతో ఈ రూల్స్ పెట్టి ఉండవచ్చు. ఒకవేళ ఫ్యాన్స్‌ను కూడా ఫోన్లు డిపాజిట్ చేయమంటే, అది ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక సంచలనం అవుతుంది. ఈవెంట్‌ను లైవ్‌లో చూడటం తప్ప, అక్కడి నుంచి ఒక్క ఫోటో కూడా బయటకు రానివ్వకుండా 'లాకప్' చేయాలన్నది జక్కన్న స్ట్రాటజీ.

ఏ రూల్స్ పెట్టినా, ఈవెంట్‌పై హైప్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లింది. ఈ గ్రాండ్ ఈవెంట్‌ను హోస్ట్ చేసే బాధ్యతను కూడా ఇద్దరు టాప్ స్టార్లకు అప్పగించారు. తెలుగు ఆడియన్స్‌ను పల్స్ తెలిసిన యాంకరింగ్ క్వీన్ సుమ కనకాల, నార్త్ ఇండియా యూత్‌ను, డిజిటల్ ఆడియన్స్‌ను కవర్ చేసేలా యూట్యూబ్ కింగ్ ఆశిష్ చంచలానీ.. ఈ ఇద్దరూ కలిసి స్టేజ్‌ను హోస్ట్ చేయబోతున్నారు.

Tags:    

Similar News