జక్కన్నపై ఇంట్రస్టింగ్ రూమర్.. మహేశ్ సినిమాకు లింక్

భారతీయ సినిమా చరిత్రలోనే దర్శకధీరుడు రాజమౌళికి ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్ లో ఆయన ఇప్పటివరకు 12 సినిమాలు తెరకెక్కించారు.;

Update: 2025-08-07 03:00 GMT

భారతీయ సినిమా చరిత్రలోనే దర్శకధీరుడు రాజమౌళికి ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్ లో ఆయన ఇప్పటివరకు 12 సినిమాలు తెరకెక్కించారు. ఇందులో అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాయి. సినిమాలు తెరకెక్కించడంలో ఆయన స్క్రీన్ ప్లే, స్టోరీ టెల్లింగ్ వేటికవే సాటి.

టాలీవుడ్ లో 100 శాతం సక్సెస్ రేట్ ఉన్నఅతి కొద్ది మంది దర్శకుల్లో ఆయన ఒకరు. ఆయన కెరీర్ లో పరాజయం అన్న మాటే లేదు. ఆయన స్ట్రిప్ట్ రాసుకున్నారంటే పక్కాగా విజయం దక్కాల్సిందే. అయితే విజువల్స్, గ్రాఫిక్స్, సీన్స్ షూటింగ్ లో మాత్రం ఆయన కాంప్రమైజ్ అవ్వరు. ఆయన అనుకున్నట్లు రాకపోతే మళ్లీ రీ షూట్ చేస్తారని, ఆయన అనుకున్నట్లు పక్కాగా ఔట్ పుట్ వచ్చేదాకా దాన్ని వదిలిపెట్టరని ఇండస్ట్ర్లీో టాక్ ఉంది.

అయితే ఆయన కెరీర్ లోనే ఫస్ట్ టైమ్.. స్ర్కిప్ట్ ను మాడిఫై చేస్తున్నారనన్న ఇంట్రస్టింగ్ రూమర్ ఒకటి బయటకి వచ్చింది. ప్రస్తుతం ఆయన మహేశ్ బాబుతో ఎస్ఎస్ఎమ్ బీ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గతనెలలో కెన్యాలో జరగాల్సి ఉంది. అయితే అక్కడ రాజకీయ అనిశ్చితి కారణంగా షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది.

ఈ టైమ్ ను రాజమౌళి స్టోరీ ఎడిట్ చేయడంపై పెట్టారని టాక్. కెన్యా షెడ్యూల్ క్యాన్సిల్ అవ్వడం.. కొత్త షెడ్యూల్ ప్రారంభం కాకపోవడంతో జక్కన్నకు ప్రస్తుతం కాస్త సమయం దొరికింది. దీంతో ఈ ఫ్రీ టైమ్ లో రైటర్ కమ్ డైరెక్టర్ దేవా కట్టాతో కలిసి కొన్ని ఎపిసోడ్‌ లను రీ రైట్ చేయడానికి రాజమౌళి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రియాంక చోప్రా పాత్రతో పాటు ఇంకొన్ని ఎపిసోడ్‌ లు ఉన్నాయట.

కాగా, నిన్న ఒక చిన్నపాటి షెడ్యూల్ ప్రారంభమైంది. చిన్న చిన్న సన్నివేశాలు ఇందులో తెరకెక్కించనున్నారు. త్వరలోనే దక్షిణాఫ్రికాలో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో భారీ సెట్స్ తో మహేశ్- ప్రియాంక పైన కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రాతోపాటు ఆర్. మాధవన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్నినిర్మాత కె.ఎల్. నారాయణ రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News