SSMB29.. అప్పుడే క్లైమాక్స్ షూట్ ఏంటి జక్కన్న..?
సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి ఈ నెల 15న గ్రాండ్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేశారు.;
సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి ఈ నెల 15న గ్రాండ్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేశారు. SSMB29 సినిమా గురించి అప్డేట్స్ మొదలయ్యే సరికి ఫ్యాన్స్ లో కూడా సినిమాపై క్రేజ్ పెరుగుతూ వస్తుంది. ఏది ఏమైనా ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఈ చిత్ర యూనిట్ సినిమా ఈవెంట్ తో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. గ్లోబ్ త్రొట్టర్ మూవీ అంటూ హంగామా చేస్తూ సోషల్ మీడియా అంతా షేక్ చేస్తున్నారు. SSMB29 29 సినిమా గురించి మొన్నటి దాకా సైలెంట్ గా ఉన్న రాజమౌళి ఇక ఇప్పుడు ఆన్ డ్యూటీ ఎక్కేశాడు.
పృధ్విరాజ్ ఫస్ట్ లుక్..
ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ షూట్ జరుగుతుందని.. ఈరోజు పృధ్విరాజ్ ఫస్ట్ లుక్ వస్తుందని సోషల్ మీడియా ద్వారా చెప్పారు రాజమౌళి. త్వరలోనే పెద్ద ఈవెంట్ తో సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. ఐతే రాజమౌళి షేర్ చేసిన పాయింట్ చూసి షాక్ అయ్యారు. అదేంటి అంటే రాజమౌళి అప్పుడే మహేష్ సినిమా క్లమీఅక్స్ షూట్ చేస్తున్నాడా అని అనుకుంటున్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ షూట్ అవుతుందని రాజమౌళి చెప్పాడు. ఐతే అప్పుడే క్లైమాక్స్ దాకా వచ్చారంటే సినిమాను జక్కన్న పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే తెరకెక్కిస్తున్నారని అనిపిస్తుంది. ఇక గ్లోబ్ త్రొట్టర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమాగా రాబోతుంది.
15న మహేష్ పోస్టర్ తో పాటు సర్ ప్రైజింగ్ గ్లింప్స్..
ఐతే ఈ నెల 15న మహేష్ పోస్టర్ తో పాటు సర్ ప్రైజింగ్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మొత్తానికి ఎస్.ఎస్.ఎం.బి 29 విషయంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఏదైతే ఊహించారో దానికి తగినట్టుగానే సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టాడు జక్కన్న. ఇక సోషల్ మీడియాలో మహేష్ కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. స్ట్రీట్ ఆఫ్ హైదరాబాద్ అంటూ ప్రియాంకా చోప్రా తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈసారి ఈ ట్రిప్ సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని అన్నాడు మహేష్.
సో మహేష్, ప్రియాంక చోప్రా, పృధ్విరాజ్ తో పాటు రాజమౌళి కూడా ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమా కోసం డ్యూటీ ఎక్కేసినట్టు ఉన్నారు. నవంబర్ 15న భారీ ఈవెంట్ గా జరగబోతున్న ఈ ఈవెంట్ ని జియో హాట్ స్టార్ లైవ్ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. మొదటిసారి యూట్యూబ్ కాకుండా జియో హాట్ స్టార్ లో ఒక సినిమా ఈవెంట్ లైవ్ ఇవ్వడం జరుగుతుంది. రాజమౌళి సినిమా అంటే ఆమాత్రం రేంజ్ ఉండాలి కదా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.