ఆస్తులు అమ్మేద్దామనుకున్న జక్కన్న ఫ్యామిలీ.. కానీ సడెన్ గా..
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గురించి అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడాయన.;
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గురించి అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడాయన. బాహుబలి సిరీస్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను అలరించారు. బాహబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్ క్లూజన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ను సొంతం చేసుకుని సత్తా చాటారు.
బాహుబలి ది బిగినింగ్ సినిమా వచ్చి 10 ఏళ్లు కంప్లీట్ అయిపోయాయి. అయితే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఆ మూవీ రిలీజ్ టైమ్ లో జక్కన్న.. ఏకంగా తన ఆస్తులు అమ్మి నిర్మాతలను కాపాడుదామని అనుకున్నారట. చాలా టెన్షన్ అనుభవించారట. ఇప్పుడు ఆ విషయాన్ని రాజమౌళి స్వయంగా చెప్పగా.. అంతా షాక్ అవుతున్నారు.
బాహబలి సిరీస్ చిత్రాలు రెండు కలిపి ఇప్పుడు బాహుబలి: ది ఎపిక్ టైటిల్ తో నేడు రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి ప్రీమియర్స్ కూడా పడ్డాయి. ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి రీసెంట్ గా సినిమాలో లీడ్ రోల్స్ పోషించిన ప్రభాస్, రానాతో చిట్ చాట్ నిర్వహించగా, అప్పుడు బాహుబలి టైమ్ లో జరిగిన దాన్ని ప్రస్తావించారు.
నిజానికి భారీ బడ్జెట్ తో రూపొందిన బాహబలి మూవీతో ఎలా అయిన హిట్ కొట్టేస్తామని అనుకున్నట్లు రాజమౌళి తెలిపారు. కానీ మూవీకి ప్రీమియర్స్ తో మిక్స్ డ్ టాక్ వచ్చిందని అన్నారు. రూ.20 కోట్ల డెఫిసిట్ తో రిలీజ్ అయిన సినిమాకు డివైడ్ టాక్ పెరిగిపోయిందని, అప్పుడు మూవీ టీమ్ అంతా చాలా టెన్షన్ పడ్డామని జక్కన్న గుర్తు చేసుకున్నారు.
"అదే సమయంలో తన వదినను ఎవరో ఓ జర్నలిస్ట్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేశారు. అందులో బాహుబలిలో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తిన ఫోటోను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారు. శివలింగం బదులు జండూ బామ్ ను ఎత్తుకున్నట్లు ఎడిట్ చేశారు. ప్రొడ్యూసర్ బలి, డిస్ట్రిబ్యూటర్లు బలి, ఆడియన్స్ బలి అంటూ కామెంట్స్ పెట్టారు " అని రాజమౌళి తెలిపారు.
"వారికి ఆ గ్రూప్ లో మా వదిన ఉందని వాళ్లకు గుర్తులేదేమో. కానీ ఆమె మాత్రం చాలా టెన్షన్ పడ్డారు. ఆ తర్వాత మాకు వాటిని చూపించారు. అయితే సినిమా రిజల్ట్ విషయంలో నాకు భయం లేదు. కంటెంట్ పై నమ్మకం ఉన్నా.. ఒక వేళ ఏం జరిగినా నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే మరో మూవీని తీసి హిట్ కొట్టేసి రికవర్ అవుతా " అని చెప్పారు.
కానీ తనకు నిర్మాత విషయంలో చాలా భయమేసిందని తెలిపారు జక్కన్న. ఏమైనా తేడా కొడితే ఆస్తులు అమ్మేద్దామని ఫిక్స్ అయ్యానని, లెక్కలు కూడా చూసుకున్నానని చెప్పారు. కానీ రిలీజ్ రోజు సాయంత్రానికి సినిమా టాక్ మొత్తం చేంజ్ అయిందని, ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయిందని పేర్కొన్నారు. మొత్తానికి బాహుబలి ది బిగినింగ్ సమయంలో జక్కన్న మామూలుగా టెన్షన్ పడలేదన్నమాట.