జక్కన్న 'వారణాసి'.. ఫస్ట్ ఇండియన్ మూవీ అవుతుందా?

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి మూవీపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి;

Update: 2026-03-08 11:30 GMT

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి మూవీపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో నెవ్వర్ బిఫోర్ అనేలా సినిమా రూపొందుతుందని తెలుస్తోంది. తాజాగా వారణాసి.. ఓ విషయంలో ఫస్ట్ ఇండియన్ మూవీగా నిలవనుందని టాక్ వినిపిస్తోంది.

నిజానికి వారణాసిపై మంచి అంచనాలు నెలకొనగా.. థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సినిమా రిలీజ్ కానుండగా.. ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. ఓవర్సీస్ రైట్స్ కోసం ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ దాదాపు రూ.160 కోట్ల ఆఫర్‌ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

అందులో నిజమెంతో తెలియదు కానీ.. నెట్టింట ప్రచారం మాత్రం జరుగుతోంది. ఒకవేళ ఆ డీల్‌ ఖరారైతే, ఓవర్సీస్‌ రైట్స్‌ రూపంలోనే అంత భారీ మొత్తాన్ని అందుకున్న తొలి భారతీయ సినిమాగా వారణాసి రికార్డు సృష్టించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే సమయంలో ఇంకా ఓవర్సీస్ రైట్స్ ఆఫర్ పై వారణాసి మేకర్స్ డిసైడ్ అవ్వలేదని వార్తలు వస్తున్నాయి.

నిజానికి ఒక సినిమాపై ఆసక్తి పెరగడానికి ట్రైలర్‌ లేదా టీజర్‌ కారణమవుతుంది. కానీ వారణాసి విషయంలో మాత్రం టైటిల్‌ గ్లింప్స్‌ విడుదలతోనే భారీ చర్చ మొదలైంది. దర్శకుడు రాజమౌళి తన ప్రత్యేక శైలిలో కథ రేంజ్ తో పాటు సినిమా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ గ్లింప్స్‌ ను రూపొందించడంతో ప్రేక్షకుల్లో ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఓవర్సీస్ భారీ ఆఫర్ కు ఆ గ్లింప్సే కారణమని చెప్పాలి.

ఇక సినిమా విషయానికొస్తే.. ఫాంటసీ మైథలాజికల్‌ జోనర్‌ లో తెరకెక్కుతున్న మూవీలో మహేష్ బాబు భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ముఖ్యంగా ఆయన రాముడి రూపంలో కనిపించే సన్నివేశాలు సినిమాలో కీలకంగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఇది మహేష్ కెరీర్‌ లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌ అని చెప్పాలి. ఆయనతోపాటు బాలీవుడ్ స్టార్ హీరో ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్నారు. మందాకినిగా కనిపించనున్నారు.

మాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ విలన్ కుంభ పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కథ, విజువల్స్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అన్నీ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వారణాసి చిత్రాన్ని 2027 ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు టార్గెట్ పెట్టుకున్నారు. ముఖ్యంగా 120కి పైగా దేశాల్లో రిలీజ్‌ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News