SSMB29 : జుట్టు పీక్కున్నా తెలియడం లేదు..!

సినిమా గురించి రాజమౌళి నోటి నుంచి ఒక్క మాట రాకున్నా సోషల్‌ మీడియాలో మాత్రం రోజుకో పుకారు చొప్పున ప్రచారం జరుగుతూనే ఉంది.;

Update: 2025-11-06 16:30 GMT

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మహేష్ బాబు సినిమా షూటింగ్‌ ఎంత వరకు వచ్చింది, అసలు సినిమా నేపథ్యం ఏంటి, మహేష్ బాబు ఎలా కనిపించబోతున్నాడు, టైటిల్‌ ఏంటి అనే విషయాలకు సంబంధించిన వివరాలను చెప్పడానికి ఒక ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేయబోతున్నారు. సాధారణంగా ప్రెస్‌ మీట్‌లు హోటల్స్ లేదా, ఏదైనా చిన్న ఆడిటోరియంలో జరుగుతాయి. కానీ మహేష్ బాబు సినిమా అనౌన్స్‌మెంట్ కోసం భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా రాజమౌళి రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఏర్పాట్లు చేస్తున్న విషయం తెల్సిందే. నవంబర్‌ 15న రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరగబోతున్న ఈవెంట్‌ కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మేకర్స్ నుంచి ఈవెంట్‌కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ రావడం లేదు.

రాజమౌళి సినిమా కథ విషయంలో...

సినిమా గురించి రాజమౌళి నోటి నుంచి ఒక్క మాట రాకున్నా సోషల్‌ మీడియాలో మాత్రం రోజుకో పుకారు చొప్పున ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ సినిమా టైటిల్‌ నుంచి మొదలుకుని మహేష్ బాబు పాత్ర వరకు అన్ని విషయాల గురించి ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతూనే ఉన్నారు. ప్రస్తుతం టైటిల్ అనౌన్స్మెంట్‌తో పాటు, సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్‌ను ప్రకటించేందుకు రాజమౌళి సిద్ధం అయ్యాడు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు. సాధారణంగా సినిమా టైటిల్‌ ను కన్ఫర్మ్‌ చేయగానే మీడియా వారికి, ఇండస్ట్రీ వారికి తెలిసి పోతుంది. కానీ ఈ సినిమా టైటిల్‌ ఏ ఒక్కరికి తెలియకుండా రాజమౌళి ప్లాన్ చేశాడు. రిజిస్ట్రర్ చేయించాడా లేదా అనేది కూడా ఇంకా తెలియదు. మొత్తానికి మీడియా వారు జుట్టు పీక్కుంటున్నా కూడా టైటిల్‌ విషయంలో చిన్న లీక్ కూడా బయటకు రావడం లేదు.

మహేష్‌ బాబుతో రాజమౌళి సినిమా...

ఇక ఊహలకు కూడా అందకుండా కాన్సెప్ట్‌ ఉండబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ కాన్సెప్ట్‌ ఏంటి, సినిమా నేపథ్యం ఏంటి అనేది రాజమౌళి నోరు విప్పితే తప్ప బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఆ విషయంలోనూ రాజమౌళి నుంచి ఎలాంటి అప్‌డేట్‌ వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. సినిమాకు సంబంధించిన చిన్న అప్‌డేట్‌ తెలియకున్నా కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా వేల కోట్ల వసూళ్లు సాధిస్తుంది అని సగటు ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు అంటే రాజమౌళిపై వారు పెట్టుకున్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని జక్కన్న ప్లాన్‌ చేస్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే స్టార్‌ కాస్టింగ్‌ ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

జియో హాట్‌ స్టార్‌ లో లైవ్ స్ట్రీమింగ్‌

రాజమౌళి గత చిత్రాలు దేనికి అదే అన్నట్టుగా అద్భుతంగా ముఖ్యంగా విజువల్స్ పరంగా వండర్‌ అన్నట్లుగా ఉంటాయి. అందుకే ఈ సినిమా విజువల్స్ విషయంలోనూ చాలా ఆసక్తి ఉంది. అందుకే అంతర్జాతీయ స్థాయి వీఎఫ్‌ఎక్స్ కంపెనీతో ఈ సినిమా కోసం వీఎఫ్‌ఎక్స్ వర్క్ చేయిస్తున్నట్లు సమాచారం అందుతోంది. సినిమా కు సంబంధించిన అన్ని విషయాలు తెలియాలి అంటే నవంబర్‌ 15 వరకు వెయిట్‌ చేయాల్సిందే. జియో హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్‌ కాబోతున్న ఆ ఈవెంట్‌ ను అత్యధికులు చూడబోతున్నారు. సాధారణంగా అనౌన్స్మెంట్‌ వీడియోను లైవ్‌ స్ట్రీమింగ్‌ ఇవ్వడమే ఎక్కువ అంటే, ఏకంగా జియో హాట్‌ స్టార్‌ లో ఈ ఈవెంట్‌ ను లైవ్‌ స్ట్రీమింగ్‌ ఇచ్చేందుకు భారీ మొత్తంలో నిర్మాతలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సినిమా ఈవెంట్‌ లతో నిర్మాతలకు ఆధాయం రాదు, కానీ జక్కన్న సినిమా కనుక ప్రతి ఒక్కటి ఆదాయాన్ని తెచ్చి పెడుతుంది.

Tags:    

Similar News