ఈగ పేరు చెప్పి భలే తప్పించుకున్నాడే!
ఇందులో సమంతను కాపాడే పాత్ర ఈగ మాత్రమే పోషిస్తుంది. అందుకే రాజమౌళి తను మెచ్చిన చిత్రంగా ఈ సినిమా పేరు చెప్పారు.;
డైరెక్టర్లు అందరికీ స్టార్ హీరోలంతా కావాల్సిన వాళ్లే. ఒకరిని ఎక్కువ..మరొకరని తక్కువ చేసే పరిస్థితి ఎక్కడా ఉండదు. అందుకే అభిమాన హీరోల విషయంలో డైరెక్టర్లు ఏ సందర్భంలోనూ ఓపెన్ అవ్వరు. ఒకరు పేరు చెబితే మరో స్టార్ ఫీల్ అవుతాడేమో అన్న సందేహంతో ఏ స్టార్ డైరెక్టర్ కూడా ఓపెన్ అవ్వరు. ఏ హీరోతో పనిచేస్తే ఆ హీరోలో సామర్ధ్యాల గురించి మాట్లాడుతారు తప్ప తనే గొప్ప స్టార్ అని మాత్రం ఎక్కడా ప్రోజెక్ట్ చేయరు. తాజాగా పాన్ ఇండియా సంచలనం రాజమౌళి కూడా ఇలాంటి సమాధానమే చెప్పారు.
మీ అభిమాన హీరో ఎవరు? అంటే రాజమౌళి ఎంతో తెలివైన సమాధానం చెప్పారు. అసలు హీరో అనే ప్రస్తావనే రాకుండా స్పందించారు. తన కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా `ఈగ`ను చెప్పారు. ఇందులో నాని హీరోగా నటించాడు. కానీ ఆ పాత్ర క్లైమాక్స్ లో చనిపోతుంది. కానీ ఇందులో అసలైన హీరో ఎవరు? అంటే ఈగ మాత్రమే. ఇందులో సమంతను కాపాడే పాత్ర ఈగ మాత్రమే పోషిస్తుంది. అందుకే రాజమౌళి తను మెచ్చిన చిత్రంగా ఈ సినిమా పేరు చెప్పారు. ఈగ ప్రధాన పాత్ర పోషించిన సినిమా కాబట్టి అక్కడ మరో హీరో ప్రస్తావన రాదు.
హీరోలు ఫీలయ్యే పరిస్థితి ఉండదు. అదే `బాహుబలి` సినిమానో..`మగధీర` సినిమానో, `యమదొంగ` చిత్రం గురించో చెబితే బోలెడంత కాంట్రవర్సీ అవుతుంది. ఒక హీరో పేరు చెబితే మరో హీరో ఫీల్ అవుతాడు. అయితే రాజమౌళి బాగా అభిమానించే నటుడు మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. తాను బాగా ఇష్టపడే హీరో తారక్ అని పలు సందర్బాల్లో రాజమౌళి చెప్పారు. కానీ ఇప్పుడా సమాధానం ఓపెన్ గా చెప్పలేరు.
ఎందుకంటే టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, ప్రభాస్, బన్నీ ఇలా ఎంతో మంది పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు. రాజమౌళి తారక్ గురించి చెప్పిన సమయంలో అప్పటికి పాన్ ఇండియా స్లార్లు ఎవరూ కాదు. అందుకే అప్పట్లో తారక్ గురించి అంత ఓపెన్ గా మాట్లాడారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వాళ్ల దగ్గర ఆ టాపిక్ రాకుండానే చూసుకుంటున్నారు.