జక్కన్న వీడియో గేమ్‌లో ఎందుకు నటించాలనుకున్నారు?
ఇప్పటికే ఆయన నిర్మించిన `డెత్ స్ట్రాండింగ్ గేమ్` సక్సెస్ కావడంతో దీనికి కొనసాగింపుగా ఇప్పుడు `డెత్ స్ట్రాండింగ్ 2`ని రెడీ చేస్తున్నారు.;
ఇండియన్ సినిమాల్లో బాహుబలితో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన దర్శకుడు రాజమౌళి. తను తెరకెక్కించిన `బాహుబలి` క్యారెక్టర్‌లతో ఇప్పటికే కామిక్ క్యారెక్టర్స్‌ని క్రియేట్ చేయడమే కాకుండా పలు గేమ్‌లని రూపొందించి విడుదల చేయడం అవి సూపర్ హిట్ కావడం తెలిసిందే. అయితే ఇప్పుడు తనే ఓ కామిక్ క్యారెక్టర్‌గా మారి జక్కన్న వినోదాన్ని అందించబోతున్నాడు. ఆయన క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని జపాన్‌కు చెందిన హిడియో కోజిమా ఓ వీడియో గేమ్‌ని విడుదల చేయబోతున్నాడు.
ఇప్పటికే ఆయన నిర్మించిన 'డెత్ స్ట్రాండింగ్ గేమ్' సక్సెస్ కావడంతో దీనికి కొనసాగింపుగా ఇప్పుడు 'డెత్ స్ట్రాండింగ్ 2'ని రెడీ చేస్తున్నారు. ఇందులోనే రాజమౌళి సందడి చేయబోతున్నారు. ఓ అతిథి పాత్రలో ఆయన మెరవనున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తూ వైరల్ అవుతోంది. తన సినిమాల్లో నటించిన వారినే కామిక్ క్యారెక్టర్లుగా చేసి విడుదల చేసిన జక్కన్న తను కూడా ఈ వీడియో గేమ్‌లో ఎందుకు నటించాల్సి వచ్చింది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
జక్కన్నకు వీడియోగేమ్‌లంటే చాలా ఇష్టమట. అంతే కాకుండా జపాన్‌క చెందిన హిడియో కోజిమ్ అన్నా కూడా ఆయనకు ప్రత్యేకమైన అభిమానం. అదీ కాకుండా దర్శకుడిగా గ్లోబల్ అటెన్షన్ కోసం జక్కన్న ఈ వీడియో గేమ్‌ని అంగీకరించాడని ఇన్ సైడ్ టాక్. ఈ వీడియో గేమ్ కారణంగా వరల్డ్ వైడ్‌గా జక్కన్న ఎవరనేది పెద్దలతో పాటు పిల్లలకు కూడా తెలిసిపోతుంది. దీంతో హాలీవుడ్ డైరెక్టర్లకు దక్కని క్రేజ్ రాజమౌళికి దక్కుతుందనే ఈ వీడియో గేమ్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్‌తో జక్కన్న పాన్ వరల్డ్ మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ మూవీని సైలెంట్‌గా ఫినిష్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. మహేష్ చాలా స్లో..జక్కన్న కూడా మేకింగ్ పరంగా చాలా స్లోగా చెక్కుతుంటారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం తన పంథాను మార్చుకున్నారట. మహేష్‌లా తను కూడా స్లో అయితే ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తి కాదని రియలైజ్ కావడం వల్లే ఈ ప్రాజెక్ట్‌ని సైలెంట్‌గా పూర్తి చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.