రాజమౌళికి RGV సపోర్ట్.. ఈసారి ఏమన్నారంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ లో తెరకెక్కిస్తున్న వారణాసి మూవీ ఈవెంట్ లో దర్శకధీరుడు రాజమౌళి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.;
సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ లో తెరకెక్కిస్తున్న వారణాసి మూవీ ఈవెంట్ లో దర్శకధీరుడు రాజమౌళి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. తనకు దేవుడిపై నమ్మకం లేదని, కానీ నాన్న హనుమంతుడు వెన్నంటే ఉండి నడిపిస్తాడని అంటారని చెప్పారు. కానీ ఇలా జరుగుతుంటే ఎలా నడిపిస్తున్నాడని కోపం వచ్చిందని చెప్పారు.
దీంతో అనేక సినీ ప్రియులు, నెటిజన్లు, అభిమానులు స్పందించారు. పలువురు హిందూ సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. అలా చాలామంది జక్కన్నకు విరుద్ధంగా కామెంట్స్ చేస్తూ, ట్రోల్ చేస్తుండగా. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. రాజమౌళికి సపోర్ట్ గా నిలిచారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి గట్టి కౌంటర్ ఇచ్చారు.
రాజమౌళి నాస్తికుడు అయితే తన మనోభావాలను చెప్పే హక్కు లేదా అని ప్రశ్నించారు. ఆయన దేవుడిని నమ్మకపోయినా అది నేరం కాదని అన్న ఆయన.. గ్యాంగ్ స్టర్ సినిమా తీయాలంటే దర్శకుడు గ్యాంగ్ స్టర్ అవ్వాలా అంటూ సెటైర్ వేశారు. ఇప్పుడు మరో ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేయగా.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
"దేవుడిపై నమ్మకం లేడని చెప్పే హక్కు.. నమ్ముతున్నానని హక్కు ఉంది.. కానీ ఏదో ప్లే అవ్వలేదు.. తనకున్న బాధతో వర్కౌట్ అవ్వకపోవడంతో దాన్నుండి మాటలు వస్తాయి. ఏదో పాత మూవీలో హీరో దేవుడిని తిట్టేస్తారు. ఎంత చేసినా తనను చూడలేదు అంటారు. అలా రాజమౌళి కూడా తన వైఫ్ ఇలా అన్నారు.. ఫాదర్ అలా అన్నారు" అని చెప్పారు.
"కానీ దాన్ని కంప్లీట్ గా మర్చిపోయారు. ఏ సందర్భంలో ఉన్నారో పట్టించుకోకుండా.. దేవుడిని అలా అనేస్తారా.. ఇలా అనేస్తారా.. అని అంటున్నారు. దేవుడిపై నమ్మకం లేదని ఆయన అన్నారు. అయితే రాజమౌళికి ఉన్న ఫేమ్, సక్సెస్, వెల్త్.. కామెంట్స్ చేసే వాళ్లలో అందరికీ ఉంటుందా".. అని రామ్ గోపాల్ వర్మ క్వశ్చన్ చేశారు.
"నమ్మకపోయినా దేవుడు ఎందుకు రాజమౌళిని సపోర్ట్ చేస్తున్నారు.. దేవుడికి నాస్తికులంటే ఎక్కువ ఇష్టమా.. లేకుంటే ఎవరేమన్నారో నోట్ చేసుకోడా.. వేరే పనిలో బిజీగా ఉన్నారా.. నా ఉద్దేశంలో ఇదంతా జలసీ.. అంతా రాజమౌళి టాలెంట్ ను చూస్తున్నారు. ఆయనకు దేవుడుపై నమ్మకం ఉందో లేదో అనవసరం" అని అన్నారు.
"టైమ్ పాస్ అవ్వక కొందరు నోరు పారేసుకున్నారు.. రాజమౌళి కామెంట్స్ కు ఎవరూ హార్ట్ అవ్వరు.. కాస్త యాక్ట్ చేస్తారు.. అందుకే ఒక్క క్వశ్చన్.. మీరు ఎక్కువ పూజలు చేస్తున్నారని అనుకుందాం.. కానీ రాజమౌళికి దేవుడు అంత సక్సెస్, వెల్త్ ఇచ్చారు. మీరు ఎవరైనా వెళ్లి దేవుడిని అడగగలరా?" అంటూ ఆర్జీవీ.. జక్కన్నపై కామెంట్స్ చేస్తున్న వారిని క్వశ్చన్ చేశారు.