బీటౌన్ లో ప్రభాస్ మార్క్.. రాజాసాబ్ తో పోటీలో కాంప్రమైజ్

ఒకవేళ వాయిదా తప్పదని నిర్మాతలు భావిస్తే, మార్చ్ కు షిఫ్ట్ చేయాలని చూస్తున్నారని సమాచారం. అటు లవ్ అండ్ వార్, టాక్సిక్ సినిమాల్లో ఏదైనా ఒకటి రేసులో నుండి తప్పుకుంటే.;

Update: 2025-08-10 01:30 GMT

ప్రభాస్ రాజాసాబ్ - రణ్ వీర్ సింగ్ దురంధర్ సినిమాలు రెండూ డిసెంబర్ 05నే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. ఒకే రోజు ఈ రెండు భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. అయితే రాజాసాబ్ సంక్రాంతికి షిఫ్ట్ కానుందని ఇప్పటిరే ప్రతారం జోరందుకుంది. తెలుగు రాష్ట్రాల బయ్యర్లు కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలని నిర్మాతలను అడుగుతున్నారు. కానీ దీనిపై ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇప్పటికే స్పష్టం చేశారు.

మరోవైపు డిసెంబర్ 05వ తేదీనే లాక్ చేసుకున్న రణ్ వీర్ సింగ్ దురంధర్ సినిమా మీద రాజా సాబ్ ప్రభావం పడుతుందని ముంబై వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభాస్ తో క్లాష్ అంటే ఓపెనింగ్స్ దెబ్బ తినే ఛాన్స్ ఉందని.. అందుకే సినిమాను ప్రీ పోన్ లేదా పోస్ట్ పోన్ చేసుకోవాలని నార్త్ డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే దురంధర్ సినిమాకు ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేదట. నవంబర్ చివరి వారానికి మొత్తం పూర్తి కాకపోవచ్చని అంటున్నారు.

ఒకవేళ వాయిదా తప్పదని నిర్మాతలు భావిస్తే, మార్చ్ కు షిఫ్ట్ చేయాలని చూస్తున్నారని సమాచారం. అటు లవ్ అండ్ వార్, టాక్సిక్ సినిమాల్లో ఏదైనా ఒకటి రేసులో నుండి తప్పుకుంటే.. దురంధర్ ఆ స్లాట్ ను తీసుకునేందుకు సిద్ధంగా ఉందట. ప్రస్తుతానికైతే.. ఎలాంటి అనౌన్స్ మెంట్ లు ఇవ్వకుండా వేచి చూడాలని భావిస్తున్నారట మేకర్స్. పైగా ట్రైలర్ వచ్చాక దురంధర్ పై హైప్ పెరిగింది. మంచి వైలెంట్ కంటెంట్ తో, యానిమల్ ను తలపించేలా ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. అందుకే రిలీజ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ ప్రభావం ఏ రేంజ్ లో ఉందనేదే. తన సినిమాతో విడుదలను బట్టి పోటీకి దిగాలా వద్దా అనేది నిర్ణయించుకుంటున్నారు. అయికే రాజా సాబ్ పై హిందీలో మంచి బజ్ ఉంది. బాలీవుడ్ లో రీసెంట్ టైమ్ లో హారర్ జానర్ బ్లాక్ బస్టర్ ట్రెండ్ గా మారింది. దాంతోపాటు ప్రభాస్ కు అక్కడ మంచి మార్కెట్ ఉండడంతో బిజినెస్ పరంగానూ డిమాండ్ ఉంది.

ఈ విషయంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. అటు దురంధర్ కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. రాజా సాబ్ వాయిగా అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దురంధర్ మేకర్స్ కూడా అలెర్ట్ అయ్యారు. అందుకే అప్డేట్స్ వదలడం లేదు.

Tags:    

Similar News