మూడేళ్ల తర్వాత ప్రభాస్ రొమాంటిక్ బాట!
మారుతి సినిమా అంటే కంటెంట్ కూడా కాస్త రొమాంటిక్ గానే ఉంటుంది. ఆయన కథలు హీరోయిన్లను డిమాండ్ చేస్తుంటాయి.;
డార్లింగ్ ప్రభాస్ హీరోయిన్లతో రొమాంటిక్ పాటలు చేసి చాలా కాలమవుతోంది. `రాధేశ్యామ్` తర్వాత ఆ తరహా సినిమాలు చేయకపోవడంతో హీరోయిన్లతో రొమాన్స్ కే దూరమయ్యాడు. పూర్తిగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చేయడంతో ఫైట్లు తప్ప పాటలు లేకుండా పోయాయి. కనీసం అతడిపై సోలో పాటలకు కూడా స్క్రిప్ట్ లో ప్రాధాన్యం లేకపోయింది. దీంతో రాజాసాబ్ విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడలేదు. దర్శకుడు మారుతిని అడిగి మరీ ముగ్గురు హీరోయిన్లను పెట్టుకున్నాడు. రాజాసాబ్ లో మాళవికా మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
స్పెయిన్ లో హీరోయిన్లతో మారుతి:
మారుతి సినిమా అంటే కంటెంట్ కూడా కాస్త రొమాంటిక్ గానే ఉంటుంది. ఆయన కథలు హీరోయిన్లను డిమాండ్ చేస్తుంటాయి. కాబట్టి లక్కీగా ప్రభాస్ అన్ని రకాలుగా ఈప్రాజెక్ట్ సెట్ అయింది. ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. తాజాగా పాటల చిత్రీకరణ కోసం టీమ్ స్పెయిన్ వెళ్లింది. అక్కడ రెండు పాటల పాటు, కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. ఈ నేపథ్యంలో రాజా ఆడిపాడే హీరోయిన్లు ఎవరెవరు? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ సహా ముగ్గురి కాంబినేషన్ లో ఈ రెండు పాటలు ప్లాన్ చేసారా? లేక అవి డ్యెయెట్స్ అన్నది తెలి యాలి.
పాత మారుతిని తట్టి లేపుతాడా:
డార్లింగ్ కి అన్ని రకాలుగా కంపర్ట్ గానే ఈ పాటలు ఉండే అవకాశం ఉంది. కంటెట్ పరంగా చూస్తే ఇదొక రొమాంటిక్ హారర్ కామెడీ జానర్ చిత్రం. మారుతి సినిమాల్లో పాటలు కూడా కథలో భాగంగానే వస్తాయి. పాటలు ఎక్కడా స్టోరీని డీవియేట్ చేయవు. ఆ పాటల్లో తన మార్క్ రొమాంటిక్ యాంగిల్ ని హైలైట్ చేయడం మారుతి ప్రత్యేకత. ఈ నేపథ్యంలో మారుతి మళ్లీ పదేళ్లు వెనక్కి వెళ్లారంటే మాత్రం విధ్వంసమే. అప్పటి మారుతి మళ్లీ రాజాసాబ్ లో కనిపిస్తాడు. అదే జరిగితే రాజాసాబ్ మరో లెవల్లో ఉంటుంది.
తదుపరి ప్రచార చిత్రాల్లో రొమాన్స్:
మరి `రాజాసాబ్` ని ఎలా మలుస్తున్నాడు? అన్నది చూడాలి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనాలు భారీగా ఏర్పడిన సంగతి తెలిసిందే. వాటిలో ఎక్కడా డార్లింగ్ రొమాంటిక్ యాంగిల్ హైలైట్ అవ్వలేదు. మరి తదుపరి ప్రచార చిత్రాల్లో అందుకు ఆస్కారం ఉంటుందా? అన్నది చూడాలి. సినిమా రిలీజ్ అవ్వడానికి ఎలాగూ మూడు నెలలు సమయం పడుతుంది. ఈ లోగా జనాల్లో సినిమా ఉండాలంటే ప్రచార చిత్రాలతో జి మ్మిక్కులు తప్పని సరే. మరి మారుతి ఎలాంటి స్ట్రాటజీ తో ఉన్నారో తెలియాలి.