సమంతకు రాజ్ అదిరిపోయే గిఫ్ట్.. ఇకపై హైదరాబాద్ వస్తే..
బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు, హీరోయిన్ సమంత రీసెంట్ గా వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.;
బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు, హీరోయిన్ సమంత రీసెంట్ గా వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారని వార్తలు వస్తున్నా.. ఎప్పుడూ స్పందించని వారిద్దరూ డిసెంబర్ 1వ తేదీన పెళ్లి చేసుకున్నారు. సింపుల్ గా.. అతికొద్ది మంది సమక్షంలో ఒకటయ్యారు సామ్, రాజ్.
కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్ లింగ భైరవి టెంపుల్ లో భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకున్న సమంత, రాజ్.. ఆ తర్వాత సోషల్ మీడియాలో పిక్స్ ను పోస్ట్ చేసి విషయాన్ని తెలిపారు. దీంతో అభిమానులు, సినీ ప్రియులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. నెట్టింట పోస్టులు కూడా పెడుతున్నారు.
అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో సమంతకు రాజ్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా పెళ్లి ముందే రాజ్ నిడిమోరు.. ఓ హౌస్ ను కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని బ్యూటిఫుల్ హౌస్ ను కొన్నారని ఊహాగానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా.. పెళ్లి రోజే ఆ విషయాన్ని చెప్పి సామ్ కు రాజ్ సర్ప్రైజ్ ఇచ్చారని, జూబ్లీహిల్స్ లో కొనుగోలు చేసిన ఇంటి తాళాలు మ్యారేజ్ గిఫ్ట్ గా అందించారని ప్రచారం జరుగుతోంది. దీంతో తన భర్త ఇచ్చిన గిఫ్ట్ పట్ల సమంత ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారని సమాచారం. అదే సమయంలో మరో విషయం నెట్టింట వైరల్ గా మారింది.
రీసెంట్ గా ముంబైలో సామ్ కొత్త ఇల్లు తీసుకున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించి ఇప్పటికే అప్డేట్ ఇచ్చారు సమంత. ఫోటోలు కూడా షేర్ చేశారు. అయితే ముంబైలో ఉన్నప్పుడు ఆ ఇంట్లో.. హైదరాబాద్ వస్తే జూబ్లీహిల్స్ లోని ఇంట్లో రాజ్ నిడిమోరు, సమంత ఉంటారేమోనని ఇప్పుడు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అయితే మంగళవారం ఉదయం పెళ్లి జరగ్గా.. బుధవారం ఉదయం అత్తవారింటికి వెళ్లారు సామ్. ఆ సమయంలో ఆమెకు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు రాజ్ కుటుంబ సభ్యులు. ఆ విషయాన్ని రాజ్ సోదరి శీతల్ రీసెంట్ గా సోషల్ మీడియాలో తెలిపారు. తన పుట్టింట్లో కొత్త జంటతో దిగిన గ్రూప్ పిక్ ను కూడా ఆమె షేర్ చేశారు. సామ్ ఎంతో హ్యాపీగా కనిపిస్తున్నారని నెటిజన్లు, అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అలా చూస్తుంటే ఆనందంగా ఉందని చెబుతున్నారు.