• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ బాస్ 7 : సింపతి గేమ్...

బిగ్ బాస్ 7 : సింపతి గేమ్ ఎప్పటివరకు..?

| అయితే ఈ విషయాన్ని బయట ఉన్న రాహుల్ గమనిస్తూనే ఉన్నాడు. ఫైనల్ గా ఆమె గురించి ఒక కామెంట్ అయితే పెట్టాడు.

By - Tupaki Desk
Update: 2023-09-21 05:13 GMT

బిగ్ బాస్ సీజన్ 7 లో ఒక కంటెస్టెంట్ గురించి సోషల్ మీడియా అంతా ఓ రేంజ్ లో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఆమె ఎవరో కాదు రతిక. బిగ్ బాస్ కు రాకముందు ఆమె ఎవరో ఎవరికీ తెలియదు బిగ్ బాస్ కు వచ్చాక ఆమె డీటైల్స్ అందరికీ తెలిశాయి. బిగ్ బాస్ ఎంట్రీ స్టేజ్ మీదే తన బ్రేకప్ లవ్ స్టోరీ అంటూ నాగార్జున తో డిస్కస్ చేసింది రతిక. ఇంతకీ ఈ అమ్మాయి హార్ట్ బ్రేక్ చేసింది ఎవరు అంటే ఒకప్పటి బిగ్ బాస్ కంటెస్టెంట్ సీజన్ 4 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అని తెలుస్తుంది.

రతిక బిగ్ బాస్ లో ప్రత్యక్షం కాగానే ఆమె టీం అంతా కూడా రాహుల్ తో ఆమె దిగిన ఫోటోస్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అలా రతిక అనూహ్యంగా ఆడియన్స్ అటెన్షన్ ని తెచ్చుకుంది. ఇక హౌస్ లో అందరితో ఈక్వల్ గా తన పవర్ చూపించడానికి ప్రయత్నిస్తున్న రతిక ఛాన్స్ వస్తే మాత్రం తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతుంది. రీసెంట్ గా శివాజి తో హౌస్ లో అందరు తన ఎక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు నేనే వాళ్లకు ఆ విషయాన్ని చెప్పానని బాధపడింది రతిక.

అయితే ఈ విషయాన్ని బయట ఉన్న రాహుల్ గమనిస్తూనే ఉన్నాడు. ఫైనల్ గా ఆమె గురించి ఒక కామెంట్ అయితే పెట్టాడు. ఎన్నాళ్లని సింపతి గేమ్ ఆడుతారు. అంతా తమలోని కొత్త టాలెంట్ చూపించాలని అనుకుంటారు కానీ మరికొందరు మాత్రం ఇతరుల మీద డిపెండ్ అవుతారు అది వారి వల్లే రుజువవుతుంది. ఫేం కోసం నేమ్ ని అవసరానికన్నా ఎక్కువ వాడుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ ఇన్నర్ పర్సన్ ఇంకా పైసలు తీసుకుని ఆమె కోసం బయట పనిచేస్తున్న టీం కి కంగ్రాట్స్ అని కామెంట్ పెట్టాడు రాహుల్.

బిగ్ బాస్ ముందు ఎలా ఉన్నా సీజన్ 4 విన్నర్ తర్వాత రాహుల్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అతనిలోని టాలెంట్ ఇక్కడ వరకు తెచ్చింది. అయితే రాహుల్ తో క్లోజ్ గా ఉన్నంత మాత్రాన ఆమె రాహుల్ లవర్ అని కన్ఫర్మ్ చేయడం కరెక్ట్ కాదు. కానీ బిగ్ బాస్ లోకి వెళ్లాక రతిక మాత్రం రాహుల్ ఇమేజ్ ని వాడుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తుంది. రాహుల్ కి ఉన్న ఫాలోయింగ్ తన వైపుకి తిప్పుకుని ఈ సీజన్ నెగ్గాలని చూస్తుంది. అయితే రితిక మీద రాహుల్ రివర్స్ కౌంటర్ ఆడియన్స్ కు క్లారిటీ వచ్చేలా చేసింది. బిగ్ బాస్ హౌస్ లో రతిక ప్రయాణం ఎలా ఉంటుంది అన్నది మునుముందు చూడాలి.

Tags:    
  • Biggboss7 
  • Biggbossseason7 
  • Rahulsipliganj 
  • Rathika 
  • Socialmedia 
  • Biggbossseason4 

Similar News

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS