ఘనంగా రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం.. వధువు ఎవరంటే?

రాహుల్ సిప్లిగంజ్ తాజాగా తన ప్రేయసి హరిణ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి నిశ్చితార్థం జరిగింది.;

Update: 2025-08-18 10:08 GMT

జానపద పాటల గాయకుడిగానే కాకుండా సినిమా పాటలతో కూడా ఎంతోమంది శ్రోతలను అలరించిన ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ఈయన గాయకుడు మాత్రమే కాదు రచయిత కూడా. 2009లో వచ్చిన 'జోష్' సినిమాలోని "కాలేజ్ బుల్లోడా" అనే పాటతో సినిమా రంగంలోకి అడుగు పెట్టిన ఈయన వరుసగా పలు చిత్రాలలో పాటలు పాడే అవకాశాన్ని అందుకుంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అంతేకాదు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో కాలభైరవతో కలిసి "నాటు నాటు" పాట పాడి ఏకంగా సంచలనం సృష్టించారు.అంతేకాదు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 2023 మార్చి 13వ తేదీన ఈ పాటకు ఆస్కార్ అవార్డు లభించింది.

అలా రెడ్ కార్పెట్ పై నడిచిన రాహుల్ సిప్లిగంజ్ అదే వేడుకలో కాలభైరవతో కలిసి మరొకసారి నాటు నాటు పాట ఆలపించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఇదిలా ఉండగా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకలలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా కోటి రూపాయల నగదు బహుమతి అందుకున్న ఈయన సడన్ గా నిశ్చితార్థం చేసుకుని, అందరిని ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరైన సినీ సెలబ్రిటీలు, సన్నిహితులు ఆ ఫోటోలను షేర్ చేయడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది.

రాహుల్ సిప్లిగంజ్ తాజాగా తన ప్రేయసి హరిణ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు ఈ ఫోటోలు కాస్త వైరల్ అవ్వడంతో ఈ కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈ నిశ్చితార్థం ఆగస్టు 17 ఆదివారం రోజు జరగగా.. ఆలస్యంగా ఈ ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. గత కొన్ని రోజులుగా ప్రేమలో మునిగి తేలుతున్న వీరు ఇప్పుడు కొత్త బంధాన్ని మొదలుపెట్టడానికి సిద్ధమయ్యారని.. అందులో భాగంగానే ఎంగేజ్మెంట్ కూడా రహస్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక రాహుల్ సిప్లిగంజ్ వివాహం ఆడబోయే అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. ఈమె ఇంస్టా ప్రొఫైల్ మాత్రం లాక్ లో ఉంది.. కానీ 15.6K ఫాలోవర్స్ ను కలిగి ఉండగా.. రాహుల్ సిప్లిగంజ్ కూడా ఈమెను ఫాలో అవుతున్నారు. ఈయనతో పాటు ప్రముఖ యాంకర్ స్రవంతి చొక్కారపు, విష్ణుప్రియ, డీజే సన్నీ, సింగర్ గీతామాధురి, జబర్దస్త్ రోహిణి, అరియానా , సుప్రీత, సింగర్ నోయల్, కరుణ భూషణ ఇలా చాలామంది సెలబ్రిటీలు ఈమెను ఫాలో అవుతున్నారు. వీరందరిని బట్టి చూస్తే హరిణ్యా రెడ్డి కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి లాగే కనిపిస్తోంది. అయితే ఈమె పూర్తి బ్యాగ్రౌండ్, వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇక రాహుల్ ప్రేమాయణం విషయానికి వస్తే.. బిగ్ బాస్ 3 హౌస్ లో ఉన్నప్పుడు ప్రముఖ నటి పునర్నవితో కొన్నాళ్లు లవ్ ట్రాక్ నడిపిన ఈయన.. ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. తర్వాత ఆషు రెడ్డితో రాహుల్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.. ఇద్దరూ కలిసి ఫారిన్ ట్రిప్పులు కూడా వెళ్లారు. కానీ వీరిద్దరూ కూడా విడిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈయన లిస్టులో చాలామంది పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు హరిణ్యా రెడ్డి దగ్గర రాహుల్ ఆగిపోయారని తెలుస్తోంది.

Tags:    

Similar News