• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రహస్యం ఇదం జగత్‌.....

రహస్యం ఇదం జగత్‌.. ట్రైలర్ ఎలా ఉందంటే?

| శ్రీ చక్రానికి సంబంధించిన ఆసక్తికరమైన పాయింట్లతో రూపొందుతున్న రహస్యం ఇదం జగత్ చిత్రం ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమవుతోంది.

By - Tupaki Desk
Update: 2024-10-29 13:33 GMT

రహస్యం ఇదం జగత్‌.. ఈ సినిమా టైటిల్ చదివితేనే / వింటేనే మంచి ఇంట్రెస్ట్ కలుగుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. హిందూ పురాణాలు, ఇతిహాసాలు, శ్రీ చక్రానికి సంబంధించిన ఆసక్తికరమైన పాయింట్లతో రూపొందుతున్న రహస్యం ఇదం జగత్ చిత్రం.. ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమవుతోంది. రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం లీడ్ రోల్స్ నటిస్తున్న ఆ మూవీకి కోమల్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

సైన్స్, ఫిక్షన్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న రహస్యం ఇదం జగత్ మూవీని సింగిల్‌ సెల్‌ యూనివర్స్ ప్రొడక్షన్‌ బ్యానర్ పై పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మిస్తున్నారు. ఇప్పటికే అని పనులు పూర్తి చేసుకున్న ఆ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇటీవల అనౌన్స్ చేశారు. నవంబర్ 8వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు.

రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్.. మంచి రెస్పాన్స్ అందుకుంది. మూవీపై ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా శ్రీచక్రం గురించి చెప్పిన పాయింట్‌ అందరిలోనూ సినిమాపై ఆసక్తిని రేపింది. ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న వేళ.. మేకర్స్ ట్రైలర్ ను తీసుకొచ్చారు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ మూవీతో బిజీగా ఉన్న డైరెక్టర్ చందూ మెండేటి చేతుల మీదుగా విడుదల చేశారు.

అద్భుతమైన విజువల్స్ లో ట్రైలర్ స్టార్ట్ అయింది. అభి.. ఇక నాన్న లేరు.. నాన్న లేని అమ్మ నాకు తెలియదు.. నాన్న లేని ప్రపంచం తెలియదు.. అందుకే ఇండియాకు వెళ్లిపోదామనుకున్నా అంటూ హీరోయిన్ చెబుతున్న డైలాగ్ ఎమోషనల్ గా ఉంది. ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ గా ట్లైలర్ మారింది. సినిమాలోని పాత్రలను మేకర్స్ పరిచయం చేశారు. అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఓ చిన్న అమ్మాయి.. రాముడు, హనుమంతుడికేనా.. మనకు ఇలా జరగదా చెబుతున్న డైలాగ్ ఓ రేంజ్ లో అంచనాలు పెంచుతోంది. చివరకు అమ్మ దగ్గరకు ఇద్దరం వెళ్తాం అంటూ ట్రైలర్ ఎండ్ అయింది.

మొత్తానికి.. సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉండనున్నట్లు ట్లైలర్ ద్వారా అర్థమైంది. ఎడిటింగ్, వీఎఫ్ ఎక్స్ క్వాలిటీ సూపర్ గా ఉంది. ప్రతి షాట్ ఆసక్తి రేపుతుంది. బ్లాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. నటీనటులు యాక్టింగ్ ఇంప్రెసివ్ గా ఉంది. స్టోరీ లైన్ ను రివీల్ చేయకుండా.. ఓ రేంజ్ లో ట్రైలర్ ను కట్ చేశారు మేకర్స్. మూవీపై వేరే లెవెల్ హైప్ క్రియేట్ చేశారు. మరి రహస్య ఇదం జగత్ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Full View
Tags:    
  • Rahasyamidamjagath 
  • Rahasyamidamjagathtrailer 
  • Komalrbharadwaj 
  • RakeshGalebhe 
  • Sravanthiprattipati 
  • Chotakprasad 
  • Trailer 
  • Tollywood 
  • Thriller 
  • ChandooMondeti 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS