ఇష్టపడి కట్టుకున్న ఇంటినే పిల్లల కోసం పాఠశాలగా!
రాఘవ లారెన్స్ సేవా దృక్ఫధం గురించి చెప్పాల్సిన పనిలేదు. గత కొంత కాలంగా ఆయన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.;
రాఘవ లారెన్స్ సేవా దృక్ఫధం గురించి చెప్పాల్సిన పనిలేదు. గత కొంత కాలంగా ఆయన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సహాయం అంటూ ఆయన్ని ఆశ్రయిస్తే అందని సహాయం ఉండదు. ఎంతో మంది నిరాశ్రయలకు ఆశ్రయం కల్పించారు. నిరుపేద విద్యార్దులను చదివి స్తున్నారు. తాజాగా విద్యార్దులకు ఉచిత విద్యను అందించేందుకు తన సొంత ఇంటినే పాఠశాలగా మార్చేందుకు సిద్దమయ్యారు. `కాంచన 4` సినిమాకు తాను తీసుకున్న పారితోషికంతో ఈ పనులు మొదలు మొదలు పెడుతున్నట్లు తెలిపారు.
ఈ ఇంటితో లారెన్స్ అనుబంధం ఎంతో గొప్పది. డాన్స్ మాస్టర్ గా తాను సంపాదించిన డబ్బుతో కట్టుకున్న ఇల్లు అది. అటుపై తాను స్టార్ అయిన తర్వాత ఆ ఇల్లు అనాధశ్రమంగా మార్చారు. అందులో చదువుకున్న పిల్లలు ఇప్పుడు బాగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. తాజాగా మరోసారి అదే ఇంటిని మరో సేవకు ఉపయోగించడం గర్వంగా పేర్కొన్నారు. స్కూల్ గా మారిన అనంతరం అందులో పాఠాలు చెప్పనున్న తొలి గురువు అదే ఇంట్లో పెరిగిన ఓ పిల్లాడు కావడం విశేషమని, ఇది తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం కంటే గొప్ప పని ఏది ఉండ దన్నారు .
సహాయం చేయడంలో వచ్చే సంతోషం ఇంకే పనిలో తనకు దొరకదని, సినిమాలను ఎంతగా ప్రేమిస్తానో, సహాయాన్ని అంతే ప్రేమిస్తూ పని చేయడం తనకు అలవాటన్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటి జనులు లారెన్స్ గొప్ప మనసును ఉద్దేశించి పోస్టులు పెడుతున్నారు. సహాయం చేయడంలో మీకు మీరే సాటి అంటూ పోస్టులు పెడుతున్నారు. మీ సహాయం ద్వారా గొప్ప సమాజాన్ని నిర్మిస్తున్నారి, మీలాంటి దాతలు మరింత మంది రాగలిగితే? నిరాశ్రయులు, పేద పిల్లలకు గొప్ప భవిష్యత్ ఉంటుందని మరికొంత మంది యూజర్స్ అభిప్రాయ పడ్డారు.
ప్రస్తుతం లారెన్స్ హీరోగా `కాంచన 4` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. `ముని` ప్రాంచైజీలో భాగంగా రిలీజ్ అవుతున్న చిత్రమిది. ఈ ప్రాంచైజీకి ప్రేక్షకుల నుంచి గొప్ప ఆదరణ దక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు `బెంజ్` అనే మరో చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇంకా మరికొన్ని ప్రాజెక్ట్ లు చర్చలో దశలో ఉన్నాయి. `కాంచన -4` సహా `బెంజ్` చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు.