హిట్ కాంబో రిపీట్.. కానీ ఈసారి మరింత స్పెషల్‌గా!
ఇక వరుణ్ తేజ్ ఈ సినిమాలో కనకరాజు పాత్రలో కనిపించబోతున్నారు. రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్‌లో నేను తిరిగొచ్చేశా అంటూ కొరియన్ భాషలో చెప్పిన డైలాగ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.;
టాలీవుడ్‌లో తాజాగా చర్చకు దారితీస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న కొరియన్ కనకరాజు ఒకటి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే టైటిల్‌తోనే ఆసక్తిని రేకెత్తించగా, ఇప్పుడు మరో కొత్త టాక్ ఈ సినిమాపై హైప్‌ను మరింత పెంచుతోంది. ముఖ్యంగా వరుణ్ తేజ్- రాశీ ఖన్నా కాంబినేషన్ మళ్లీ తెరపై కనిపించబోతుందనే వార్త అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది. గతంలో ఈ జంట కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తారనే ప్రచారం, అది కూడా స్పెషల్ సాంగ్ రూపంలో అనగానే ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఫోకస్ పెరిగింది.
సినిమాలో రాశీ ఖన్నా స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతుందనే వార్త ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. అయితే సోషల్ మీడియాలో ఇది వైరల్ అవ్వడంతో, ఈ సాంగ్‌పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఒకవేళ ఈ కాంబో నిజమైతే, ఇది కేవలం గ్లామర్ ఎడిషన్ మాత్రమే కాకుండా, సినిమా మార్కెటింగ్‌కు కూడా ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్పెషల్ సాంగ్స్ టాలీవుడ్‌లో ఎప్పుడూ హైలైట్ అవుతుంటాయి. అలాంటిది పాపులర్ హీరోయిన్ తో ఆ సాంగ్ చేస్తే, క్రేజ్ మరింత రెట్టింపు అవుతుంది. ఈ నేపథ్యంలో వరుణ్- రాశీ రీయూనియన్ ఈ సినిమాకు అదనపు బలం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్
ఇక వరుణ్ తేజ్ ఈ సినిమాలో కనకరాజు పాత్రలో కనిపించబోతున్నారు. రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్‌లో నేను తిరిగొచ్చేశా అంటూ కొరియన్ భాషలో చెప్పిన డైలాగ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ ఒక్క డైలాగ్‌తోనే సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. ముఖ్యంగా కొరియన్ బ్యాక్‌డ్రాప్ లేదా కనెక్షన్ ఏమిటి అన్నదానిపై ఆసక్తి పెరిగింది. అదే సమయంలో వరుణ్ తేజ్ లుక్, బాడీ లాంగ్వేజ్ కూడా గత సినిమాల కంటే భిన్నంగా ఉండటంతో, ఇది ఆయన కెరీర్‌లో మరో డిఫరెంట్ అటెంప్ట్‌గా భావిస్తున్నారు.
సినిమాను కమర్షియల్ ఎంటర్టైనర్‌గా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కామెడీ, యాక్షన్, గ్లామర్ అన్నీ కలిపి ప్యాకేజ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. మేర్లపాక గాంధీ స్టైల్ ఎంటర్టైన్మెంట్, వరుణ్ తేజ్ కొత్త క్యారెక్టర్, రితికా నాయక్ గ్లామర్.. ఈ అన్ని అంశాలు కలిసి సినిమాకు పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక రాశీ ఖన్నా స్పెషల్ సాంగ్ టాక్ నిజమైతే, అది ఈ ప్యాకేజ్‌కు అదనపు ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.
సమ్మర్ సీజన్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్ రేస్‌లో ఇప్పటికే పలు సినిమాలు పోటీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో, కొరియన్ కనకరాజుకు కూడా మంచి ఛాన్స్ ఉందనే ట్రేడ్ అంచనాలున్నాయి. ముఖ్యంగా యూత్ మరియు మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందుతున్న ఈ సినిమా, సరైన టైమింగ్‌తో వస్తే బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే, వరుణ్ తేజ్- రాశీ ఖన్నా రీయూనియన్ టాక్ ఈ సినిమాకు స్పెషల్ హైలైట్‌గా మారింది. ఈ వార్త నిజమా కాదా అన్నది త్వరలో క్లారిటీ రానుంది.