పిక్‌టాక్‌ : చూడముచ్చటగా అందాల రాశి

తాజాగా మరోసారి తన క్యూట్‌ అందమైన ఫోటోను షేర్‌ చేసింది. చీర కట్టులో, పాపట బిల్ల పెట్టుకుని, సింపుల్‌ హెయిర్‌ స్టైల్‌తో, చేతికి గాజులు ధరించి పద్దతైన అమ్మాయిగా రాశి ఖన్నా లుక్‌తో మెస్మరైజ్ చేసింది.;

Update: 2025-04-16 01:30 GMT

'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ రాశి ఖన్నా. అంతకు ముందు తెలుగులో మనం, హిందీలో మద్రాస్ కేఫ్‌ సినిమాల్లో నటించింది. ఆ రెండు సినిమాలు పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. కానీ 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో నటిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు, కమర్షియల్‌ బ్రేక్‌ను సొంతం చేసుకుంది. దాంతో ఈ అమ్మడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా బిజీ అయింది. అందమైన ఈ అమ్మడికి టాలీవుడ్‌లో యంగ్‌ హీరోలకు జోడీగా వరుస సినిమాలు చేసే అవకాశం దక్కింది. అంతే కాకుండా టైర్ 2 హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌గా మారింది.

 

ఒకానొక సమయంలో కాస్త బరువు ఎక్కువగా ఉన్న రాశి ఖన్నా సౌత్‌ ఇండస్ట్రీలో సక్సెస్‌ల కోసం, ఆఫర్ల కోసం సన్నబడింది. సహజ పద్దతిలో వర్కౌట్స్ చేస్తూ బరువు తగ్గింది. బరువు తగ్గి, సన్నగా నాజూకుగా కనిపించడం ద్వారా టాలీవుడ్‌లో మరిన్ని సినిమాలను ఈ అమ్మడు సొంతం చేసుకుంది. రాశి ఖన్నా ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల కంటే హిందీ, తమిళ్ సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం తెలుగు కదా అనే ఒకే ఒక సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తుంది. హిందీలో ఈ అమ్మడు సినిమాలు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. తెలుగులో ఈమె దక్కించుకున్న విజయాలను మరే భాషలోనూ దక్కించుకోలేక పోయింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న రాశి ఖన్నా రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి తన క్యూట్‌ అందమైన ఫోటోను షేర్‌ చేసింది. చీర కట్టులో, పాపట బిల్ల పెట్టుకుని, సింపుల్‌ హెయిర్‌ స్టైల్‌తో, చేతికి గాజులు ధరించి పద్దతైన అమ్మాయిగా రాశి ఖన్నా లుక్‌తో మెస్మరైజ్ చేసింది. వావ్‌ అంటూ ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయే విధంగా స్టిల్‌ ఇచ్చింది. అలా సైడ్‌కి చూస్తూ ఉన్న రాశి ఖన్నాను నెటిజన్స్ తెగ లైక్ చేస్తున్నారు. రాశి ఖన్నా షేర్‌ చేసిన కొన్ని గంటల్లోనే లక్షకు పైగా లైక్స్‌ను దక్కించుకుంది. ఈమె అందంకు ఎంతో మంది లవ్‌ ఈమోజీలు షేర్ చేస్తూ తమ అభిమానం పంచుకున్నారు.

తెలుగులో ఈమె ఊహలు గుసగుసలాడే సినిమా తర్వాత జోరు, జిల్‌, శివం, బెంగాల్ టైగర్‌, సుప్రీమ్‌, హైపర్‌, జై లవకుశ, ఆక్సీజన్‌, టచ్‌ చేసి చూడు ఇలా వరుసగా పెద్ద సినిమాల్లో నటించడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది. పలు సినిమాలు సూపర్‌ హిట్ కాగా కొన్ని సినిమాలు యావరేజ్‌ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. కానీ ఈమె స్టార్‌ హీరోకు జోడీగా జై లవకుశలో తప్ప మరే సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకోలేక పోయింది. నటిగా ప్రస్తుతం బిజీగా ఉన్నప్పటికీ ఇంకాస్త జోరు పెంచాల్సిన అవసరం ఉందనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న రాశి ఖన్నాకు తెలుగులో మరిన్ని ఆఫర్లు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News