నారాయణ మూర్తి సంపాదించుకుంది అదొక్కటే!
కమర్షియల్ సినిమాల్లో ఛాన్సులిస్తామని ఎంతమంది దర్శకనిర్మాతలు ఆయన వెంటపడినా ఆయన మాత్రం అవేవీ పట్టించుకోకుండా తన మార్గంలోనే నడిచారు.;
తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా తన సత్తా చాటిన వ్యక్తిగా ఆర్. నారాయణ మూర్తికి ప్రత్యేక పేరుంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలోనే ఉంటున్నా ఇప్పటికీ ఆయన అతి సామాన్యుడిగానే బతుకుతుంటారు. అప్పటికీ ఇప్పటికీ అదే షర్టూ ప్యాంటూ, అవే చెప్పులు, అదే ఆటోలో తిరుగుతూ కనిపిస్తుంటారు.
స్నేహ చిత్ర అనే బ్యానర్ ను ఏర్పాటు చేసి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అఘాత్యాలను తన సినిమాల ద్వారా చూపిస్తూ ప్రశ్నిస్తూ ఉండే ఆయన్ని ఆడియన్స్ పీపుల్స్ స్టార్ అంటుంటారు. కమర్షియల్ సినిమాల్లో ఛాన్సులిస్తామని ఎంతమంది దర్శకనిర్మాతలు ఆయన వెంటపడినా ఆయన మాత్రం అవేవీ పట్టించుకోకుండా తన మార్గంలోనే నడిచారు.
అలాంటి పీపుల్ స్టార్ నుంచి తాజాగా యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమా వచ్చింది. ఆర్. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కు టాలీవుడ్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి మరియు హరీష్ శంకర్ హాజరై ఆ సినిమాను ప్రమోట్ చేశారు. ఈవెంట్ లో భాగంగా అనిల్ రావిపూడిని ఉద్దేశించి హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాను, అనిల్ రెగ్యులర్ గా ఫోన్ చేసి మాట్లాడుకోమని, ఒకవేళ అనిల్ నుంచి ఫోన్ వచ్చింది అంటే ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికైనా అయుండాలి లేదంటే ఏదైనా ఒక అరగంట పాటూ నవ్వుకునే జోక్ చెప్పడానికైనా అవుతుందని, అలాంటి అనిల్ తనకు ఫోన్ చేసి అన్న నేనొకటి అడుగుతున్నాను, కాదనుకూడదు వచ్చేయాలని చెప్పాడని, ఏంటని అడిగితే ఇలా నారాయణ మూర్తి గారి సినిమా ఈవెంట్ అన్నాడని హరీష్ శంకర్ చెప్పారు.
ఏ సినిమా ప్రమోషన్ అయినా అనిల్ భుజానే..
అనిల్ కు నారాయణ మూర్తి అంటే ఎంతిష్టమంటే, ఆయన తీసిన సినిమాను కూడా అనిల్ తన భుజాలపై వేసుకుని మరీ ప్రమోట్ చేస్తున్నాడని, ఏ సినిమా ప్రమోషన్లను అయినా అనిల్ తన భుజానే వేసుకుంటాడని అన్నారు. అదే ఈవెంట్ లో నారాయణ మూర్తి గురించి మాట్లాడుతూ.. నారాయణ మూర్తి గారు అనగానే ఇండస్ట్రీలో ఎవరైనా వచ్చి నిలబడాల్సిందేనని, ఇన్నేళ్లుగా ఆయన సంపాదించుకున్నదంటూ ఉందంటే అది ఇదేనని హరీష్ అన్నారు.