సినిమా బాగోలేకపోతే ప్రేక్షకులకు కోపం తప్పదు: మాధవన్

ఇక స్క్రీన్‌పై పాత్ర కోసం అవసరమైతే తప్ప బయట హెయిర్ కలర్ వేసుకోవడానికి తాను అసలు ఇష్టపడనని మాధవన్ తెలిపారు.

Update: 2026-08-11 08:06 GMT

సినీ ఇండస్ట్రీలో వయసు పెరిగే కొద్దీ, చాలా మంది నటులు తమ అసలు రూపాన్ని దాచుకుని, ఇంకా యంగ్‌గా కనిపించేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. కానీ వర్సటైల్ యాక్టర్ ఆర్. మాధవన్ మాత్రం ఈ విషయంలో అందరికంటే భిన్నమైన బాటలో పయనిస్తున్నారు. వయసు పెరగడాన్ని, తలలో తెల్ల జుట్టు రావడాన్ని కూడా ఆయన ఎంతో సంతోషంగా స్వీకరిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రేక్షకుల అభిప్రాయాలు, తన లుక్స్, సినిమాల గురించి మాధవన్ చెప్పిన విషయాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. వివరాల్లోకి వెళితే..

ప్రేక్షకుల కోపం పూర్తిగా న్యాయమే!:

సినిమా నచ్చకపోతే ప్రేక్షకులు తమ కోపాన్ని బయటపెట్టడంలో ఎలాంటి తప్పు లేదని మాధవన్ స్పష్టం చేశారు.ఈ ప్రపంచంలో నటన, క్రీడలలో మాత్రమే మన పనితీరు ఎలా ఉందో సాధారణ ప్రజలే తీర్పు చెబుతారు.ఒక సగటు మనిషి డబ్బులు పెట్టి టికెట్ కొని సినిమా చూడటానికి వచ్చినప్పుడు, అతని అభిప్రాయాన్ని మనం కచ్చితంగా గౌరవించి తీరాలి" అని ఆయన గట్టిగా చెప్పారు.

తెల్ల జుట్టును దాచాల్సిన అవసరం లేదు:

ఇక స్క్రీన్‌పై పాత్ర కోసం అవసరమైతే తప్ప బయట హెయిర్ కలర్ వేసుకోవడానికి తాను అసలు ఇష్టపడనని మాధవన్ తెలిపారు. " నేను సూపర్ స్టార్ రజనీకాంత్, అజిత్ కుమార్ ల నుంచి ఈ విషయాన్నినేర్చుకున్నాను. వారు ఆఫ్‌స్క్రీన్‌లో చాలా సాధారణంగా కనిపించినా, కెమెరా ముందుకు రాగానే మ్యాజిక్ చేస్తారు. చిన్నవాడిగా కనిపించాలనే ఆరాటం నాకు లేదు. పరిశ్రమలో నా పోటీ నాతోనే తప్ప ఇతరులతో కాదు" అని వివరించారు.

జి.డి. నాయుడు పాత్రలో అద్భుత నటన:

ప్రస్తుతం మాధవన్ 'ఇండియన్ ఎడిసన్' అని పిలుచుకునే జి.డి. నాయుడు జీవిత ఆధారంగా తెరకెక్కిన బయోపిక్‌లో నటించి థియేటర్లలో మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. కృష్ణకుమార్ రామ్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యంగ్ లుక్, మిడిల్ ఏజ్, సీనియర్ సిటిజన్ అనే మూడు భిన్నమైన షేడ్స్‌ ఉన్న పాత్రల్లో ఆయన ఒదిగిపోయారు. ఇక సత్యరాజ్, ప్రియమణి వంటి దిగ్గజ నటులు నటించిన ఈ చిత్రాన్ని మాధవన్ స్వయంగా నిర్మించడం విశేషం.

ఇక వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ, సహజత్వాన్ని ప్రేమిస్తున్న మాధవన్ నిజంగా ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఈ సినిమా విజయంతో పాటు ఆయన నటించిన 'అదృష్టశాలి', 'సర్కిల్' వంటి సినిమాలు కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక ప్రేక్షకుల అభిప్రాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, నటుడిగా నిరంతరం ముందుకు సాగుతున్న మాధవన్ లాంటి నటులు టాలీవుడ్, కోలీవుడ్ చిత్రసీమకు ఎంతో అవసరం.

Tags:    

Similar News