పీవీఆర్ X మ్యాడ్ డాక్ మ్యాటర్ క్లియర్.. థియేటర్లలోనే మూవీ రిలీజ్..
బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మ్యాడ్ డాక్ ఫిల్మ్స్, ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.;
బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మ్యాడ్ డాక్ ఫిల్మ్స్, ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై దినేష్ విజన్.. రీసెంట్ గా భూల్ చుక్ మాఫ్ సినిమాను రూపొందించగా.. బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బీ లీడ్ రోల్స్ లో నటించారు.
రొమాంటిక్ కామెడీ నేపథ్యంతో తెరకెక్కిన ఆ సినిమాకు కరణ్ శర్మ దర్శకత్వం వహించగా, సీమా పహ్వా, సంజయ్ మిశ్రా, జకీర్ హుస్సేన్, జయ థక్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే మే 9వ తేదీన ఆ సినిమా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల చేయలేదు మేకర్స్.
దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భూల్ చుక్ మాఫ్.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 16వ తేదీన స్ట్రీమింగ్ చేస్తామని రీసెంట్ గా ప్రకటించారు. థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నామని, కానీ దేశానికే తమ మొదటి ప్రాధాన్యమని తెలిపారు. దీంతో అంతా మూవీ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు.
అదే సమయంలో పీవీఆర్.. బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఓటీటీ రిలీజ్ చేయాలనుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము ఆ సినిమా కోసం ఎంతో ఖర్చు చేశామని, 8 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేస్తామని నిర్మాతలు తమతో ఒప్పందం చేసుకున్నారని తెలిపింది. కానీ ఇప్పుడు నష్టాలు రానున్నాయని వెల్లడించింది.
వివిధ ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశామని, ప్రేక్షకులు టికెట్స్ బుక్ చేసుకున్నారని, ఇప్పుడు థియేటర్ రిలీజ్ క్యాన్సిల్ చేస్తే నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. దీంతో వారికి అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. మూవీ ఓటీటీ రిలీజ్ పై జూన్ 16వ తేదీ వరకు స్టే విధిస్తూ భూల్ చుక్ మాహ్ నిర్మాతలకు షాక్ ఇచ్చింది!
దీంతో నిర్మాతలు ఏం చేస్తారోనని సోషల్ మీడియాలో చర్చ సాగింది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మే 23వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారట. అందుకు గాను ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని టాక్. ఇప్పుడు మార్కెటింగ్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టనున్నారు. మరి భూల్ చుక్ మాఫ్ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.