• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్పరాజ్ న్యూ లుక్.. ఇది...

పుష్పరాజ్ న్యూ లుక్.. ఇది అసలు మ్యాటర్

| ఇటీవల ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన బన్నీ, పుష్ప లుక్ తో కాకుండా కొత్త గడ్డం లుక్ తో దర్శనమిచ్చాడు.

By - Tupaki Desk
Update: 2024-08-22 07:29 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన స్టైల్, లుక్‌లతో ఎప్పటికప్పుడు ట్రెండ్స్ సృష్టిస్తునే ఉంటాడు. 'పుష్ప' సినిమాలోని ఆయన గడ్డం లుక్ ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి గడ్డం లుక్‌తో అలవాటు పడ్డ ఫ్యాన్స్ ఇప్పుడు అల్లు అర్జున్ గడ్డం ట్రిమ్ చేసేయడంతో ఆశ్చర్యపోతున్నారు. ‘పుష్ప 2’ షూటింగ్ లో ఉన్నప్పటికీ సడెన్‌గా గడ్డం తీసేయడంతో సినీ అభిమానుల్లో అనేక ప్రశ్నలు, గాసిప్‌లు మొదలయ్యాయి.

పుష్ప 2 షూటింగ్ కు బ్రేక్ పడిందని, అందుకే అల్లు అర్జున్ తన గడ్డాన్ని ట్రిమ్ చేశారని టాక్ వచ్చింది. షూటింగ్ ప్రారంభమైన తర్వాత మళ్ళీ గడ్డం పెంచేస్తాడని బన్నీ క్యాంప్ నుండి వచ్చిన మరొక సమాచారం. అయితే, అనుకున్న ప్లాన్ కన్నా ముందుగానే షూటింగ్ ప్రారంభం కావడంతో అనుకోని కంటిన్యుటీ సమస్య వచ్చి పడింది. హీరో గడ్డం కట్ చేయడం వల్ల ఇప్పుడు సినిమా క్లైమాక్స్ సీన్లకు అవసరమైన పుష్ప లుక్ తప్పిపోయింది.

సినిమా షూటింగ్స్ లో ఇలాంటి సమస్యలు చాలాసార్లు ఎదురవుతుంటాయి. అయితే ఎప్పుడూ కూడా సినిమా టీమ్ కృత్రిమ గడ్డాలు, మీసాలు, విగ్స్ తో సమస్యలు పరిష్కరిస్తూ ఉంటారు. అయితే అవి సహజంగా కనిపించడానికి కష్టమవుతుందనే సంగతి తెలిసిందే. ఈ సారి పుష్ప టీమ్ గడ్డం కంటిన్యుటీ కోసం ప్రత్యేకంగా ఒక నిపుణుడ్ని ముంబై నుంచి పిలిపించారని సమాచారం.

ఆ నిపుణుడు బన్నీకి కృత్రిమ గడ్డాన్ని తయారు చేసి అందించినట్లు తెలుస్తోంది. ఈ కృత్రిమ గడ్డం ఖర్చు గట్టిగానే అయ్యిందట. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎవరు కూడా ఆ స్థాయిలో గడ్డం కోసం ఖర్చు చేయలేదని తెలుస్తోంది. అయితే ఈ గడ్డం పూర్తిగా తాత్కాలికమే. షూటింగ్ ఉన్నప్పుడు మాత్రమే గడ్డం వేసుకుంటారట.

ఇటీవల ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన బన్నీ, పుష్ప లుక్ తో కాకుండా కొత్త గడ్డం లుక్ తో దర్శనమిచ్చాడు. ఈ సందర్భంగా అభిమానులు "ఇప్పుడు పుష్ప సీక్వెల్ క్లైమాక్స్ లో ఈ గడ్డంతోనే నటిస్తున్నారా? లేదంటే కథలో భాగంగా పుష్పరాజ్ కొత్తగా కనిపిస్తాడా?" అనే సందేహలు చాలానే వచ్చాయి.

ఇప్పటికి అభిమానుల్లో పుష్ప 2 సినిమాపై ఆసక్తి మరింతగా పెరుగుతోంది. మొదట ఆగష్టు 15న పుష్ప 2 విడుదలవుతుందని భావించిన అభిమానులు, ఇప్పుడు డిసెంబర్ 6 వరకు ఆగాల్సి వస్తోంది. అప్పటికి కూడా సినిమా విడుదల అవుతుందా? లేదా? అనే సందేహాలు కూడా వచ్చాయి. అయితే ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ ఫంక్షన్ లో డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ అని ప్రకటించడంతో అభిమానులకు ఒక క్లారిటీ వచ్చినట్లయ్యింది.

Tags:    
  • Alluarjun 
  • Pushpa2 
  • Sukmar 
  • Tollywood 
  • Panindianmovie 
  • Mythrimoviemakers 
  • Maruthinagarsubramanyam 
  • Tabitha 
  • Alluarjunbeardlook 

Similar News

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

సినిమా ప్రొడక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పాత్ర ప‌రిధి ఎంత‌?

2026-11-07 08:25 GMT

Copyright @2026

Powered by Blink CMS